ప్రతిరోజూ సవాలే

సమస్యలపై స్పందించడం.. స్ఫూర్తివీరులకు సాయం చేయడం.. మరుగునపడ్డ విజేతలకు సలాం కొట్టడం.. పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్‌ మహీంద్రా అధినేత ఆనంద్‌ మహీంద్రా నైజం.

Updated : 07 Jan 2023 04:09 IST

సమస్యలపై స్పందించడం.. స్ఫూర్తివీరులకు సాయం చేయడం.. మరుగునపడ్డ విజేతలకు సలాం కొట్టడం.. పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్‌ మహీంద్రా అధినేత ఆనంద్‌ మహీంద్రా నైజం. సామాజిక మాధ్యమాల్లో ఆయనను అనుసరించేవారికి ఈ విషయం బాగా తెలుసు. అలాగే పలు సందర్భాల్లో ఆయన యువతకు అనుభవ పాఠాలు అనదగ్గ మాటలు చెప్పారు. అందులోంచి కొన్ని...

* నాయకుడి చూపు ఎప్పుడూ ముందువైపే ఉంటుంది. భవిష్యత్తుపై సానుకూలంగా ఉంటాడు. గతాన్ని పదేపదే తలచుకోవడం, చుట్టుపక్కల చూడటం ఉండదు.

*  ప్రతిరోజునీ మనం ఓ సవాలుగానే చూడాలి. ఈరోజు కొత్తగా చేసిందేంటని ఆలోచించాలి. ఆచరించాలి. అప్పుడే ఆ రోజుకి సార్థకత.

*  సంప్రదాయ పద్ధతులు పాటిస్తుంటే.. మేక్‌ ఇన్‌ ఇండియా లక్ష్యం చేరలేం. ఒక్క ఉదుటున దూకుడు పెంచాలి. పోటీదారుల కన్నా నాలుగుగడుగులు ముందుండాలి.

*  నా దృష్టిలో విద్య ఒక్కటే మెరుగైన సమాజాన్ని తయారు చేస్తుంది. అక్షరాస్యత అధికంగా ఉన్నచోటే ఉదారవాద సమాజం తయారవుతుంది.

*  మన ఉత్పత్తులను అమెరికా వినియోగదారులకు అమ్మాలనుకున్నప్పుడు మనం వెంటనే అమెరికన్లుగా మారిపోవాలి. అలాగైతేనే వాళ్ల మనస్తత్వం అర్థం చేసుకోగలం.

*  విద్య అంటే ఒక పూజగదిలాంటిది. భక్తితో అన్నీ సమర్పించాలి. మనం దానికోసం వెచ్చించినదెంత? అని లాభనష్టాల బేరీజు వేసుకోకూడదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని