కలప కళ్లజోళ్లు

స్టైల్‌ కోసం కొందరు.. చూపు తక్కువై ఇంకొందరు. మొత్తానికి ముఖానికి కొత్త లుక్‌ని ఇవ్వడం కోసం రకరకాల కళ్లజోళ్లు పెట్టేస్తుంటారు. ఇక ఫ్యాషన్స్‌ ఫాలో అయ్యే యువత గురించి.....

Published : 02 Nov 2019 00:46 IST

ఫ్యాషన్‌

స్టైల్‌ కోసం కొందరు.. చూపు తక్కువై ఇంకొందరు. మొత్తానికి ముఖానికి కొత్త లుక్‌ని ఇవ్వడం కోసం రకరకాల కళ్లజోళ్లు పెట్టేస్తుంటారు. ఇక ఫ్యాషన్స్‌ ఫాలో అయ్యే యువత గురించి వేరే చెప్పాలా! ఏవి ట్రెండీగా అనిపిస్తే వాటిని ప్రయత్నిస్తుంటారు. అందులో భాగంగానే చెక్క కళ్లజోళ్లకు ఓటేస్తున్నారు. అవే ఇవి. పలు రకాల డిజైన్లలో యువతని ఆకట్టుకునేలా వీటిని అందిస్తోంది ‘కొకో లినీ’ అనే సంస్థ. ‘సుడాన్‌ ఉడెన్‌, బోట్స్‌వా ఉడెన్‌, గాంబియా ఉడెన్‌...’ లాంటి పేర్లతో వీటిని దేశీయ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ప్లాస్టిక్‌ ఉత్పత్తులను తగ్గిస్తూ ఎకోఫ్రెండు అనిపించుకోవాలంటే వీటిని ప్రయత్నించొచ్ఛు.

● వీటి ప్రారంభ ధర రూ.2,000


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని