క..క..కాలేజీ స్టైలే..!

ఎప్పుడూ ఒకే రకమైన దుస్తులతో స్టైలింగ్‌ చేస్తే ఎలా? ఎప్పటికప్పుడు ట్రెండు మారాలి. శీతాకాలం అనగానే....

Published : 14 Dec 2019 00:31 IST

ఫ్యాషన్‌

ప్పుడూ ఒకే రకమైన దుస్తులతో స్టైలింగ్‌ చేస్తే ఎలా? ఎప్పటికప్పుడు ట్రెండు మారాలి. శీతాకాలం అనగానే.. అన్ని రోజులూ హుడీస్‌, జర్కిన్లు.. ఇవేనా? కాస్త కొత్తగా ఆలోచిద్దాం అనుకుంటే ‘టార్టన్‌’ ట్రెండ్‌ని ట్రై చేయండి. చూడ్డానికి సింపుల్‌గా ఉన్నా.. ఈ షర్టులు కొత్త లుక్‌ని ఇస్తాయి. గళ్ల చొక్కాలపై మక్కువ ఎక్కువ ఉంటే.. ఇవి మీకు సరైన ఎంపికే. వీటిని కేవలం క్యాజువల్‌ వేర్‌గా చూడక్కర్లేదు. మీదైన స్టైలింగ్‌తో హుందాగా మార్చేయొచ్చు కూడా. వీటిల్లో ఎక్కువగా ముదురు రంగులే ఆకట్టుకుంటాయి.●

ఈ షర్టులపై డార్క్‌ డెనిమ్స్‌ జీన్స్‌ వేసి టక్‌ చేస్తే ప్రొఫెషనల్‌గా కనిపిస్తారు. సమావేశాలకు వెళ్లాల్సి వస్తే స్టైలిష్‌ కోటు లేదా జాకెట్‌ని వేసుకుంటే మీ హుందాతనానికి తిరుగుండదు.●

కాలేజీ కుర్రకారు ఈ చొక్కాల లోపల తెలుపు రంగు టీషర్టు వేసి షర్టు బటన్లు పెట్టకుండా వదిలేస్తే సిసలైన స్టూడెంట్‌ అయిపోతారు.●

రాత్రి వేళల్లో శుభకార్యాలకు వెళ్లేటప్పుడు ఎరుపు రంగుపై నలుపు, తెలుపు గడులు ఉన్న చొక్కాపై నలుపు డెనిమ్‌ ప్యాంట్‌ని ప్రయత్నించొచ్ఛు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని