వెచ్చనైన మ్యాచింగ్‌

చలికాలం.. దుస్తులతో మీదైన   స్టైలింగ్‌ చేసుకోవచ్చు. మార్కెట్‌లో దొరికే వాటిని ఒక్కొక్కటిగా ఎంపిక చేసుకుని కొత్తగా కనిపించేందుకు ఇదే సరైన సమయం.. కానీ ధరించే ప్రతిదీ మీ శరీర సౌష్ఠవానికి తగినదై ఉంటేనే ట్రెండీ లుక్‌ సొంతమవుతుంది. మరి చలికాలంలో వెచ్చగా మరింత ట్రెండీగా రెడీ అవుదామనుకుంటే వీటిపై ఓ లుక్కేయండి.,,,

Published : 21 Dec 2019 01:12 IST

చలికాలం.. దుస్తులతో మీదైన స్టైలింగ్‌ చేసుకోవచ్చు. మార్కెట్‌లో దొరికే వాటిని ఒక్కొక్కటిగా ఎంపిక చేసుకుని కొత్తగా కనిపించేందుకు ఇదే సరైన సమయం.. కానీ ధరించే ప్రతిదీ మీ శరీర సౌష్ఠవానికి తగినదై ఉంటేనే ట్రెండీ లుక్‌ సొంతమవుతుంది. మరి చలికాలంలో వెచ్చగా మరింత ట్రెండీగా రెడీ అవుదామనుకుంటే వీటిపై ఓ లుక్కేయండి.

* స్మార్ట్‌గా కనిపించడానికి సింపుల్‌ ట్రిక్‌.. ధరించే దుస్తులు ఒకదానికోటి మ్యాచ్‌ అయ్యుండాలి. ఉదాహరణకు ఓ క్లాసిక్‌ తెలుపు స్వెటర్‌ వేసుకొని డెనిమ్‌ జీన్స్‌ వేస్తే క్లాస్‌గా కనిపిస్తారు. మరింత ట్రెండీ లుక్‌ కోసం స్వెటర్‌పై ఓ స్లీవ్‌లెస్‌ పఫర్‌ జాకెట్‌ వేయండి.

కొత్తవారిని కలిసేందుకు వెళ్లినప్పుడు ఇది మంచి ఛాయిస్‌. ఇక ఆఫీసు సమావేశాలకు స్వెటర్‌పై లాంగ్‌ వింటర్‌ కోట్‌.. దానిపై ఓ స్కార్ఫ్‌ ప్రయత్నించొచ్చు.

* ఇక మిగతా ఉపకరణాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం. మీటింగ్స్‌కి ఫార్మల్‌ షూ, కాలేజీకి లూఫర్స్‌ వేయొచ్చు. సింపుల్‌గా స్మార్ట్‌ లుక్‌ ఇచ్చే వాచ్‌ని ఎంచుకోవచ్చు. తేలికపాటి రంగుల(ఆరెంజ్‌, పసుపు) కళ్లజోళ్లు ప్రయత్నించొచ్చు.  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని