మంచి కాఫీలాంటి టోపీలు

కొండగాలులు వెచ్చగా మారుతూ.. ముఖానికి ఎండ తగిలే కాలంలోకి మెల్లగా అడుగు పెట్టేస్తున్నాం. దీంతో ఫ్యాషన్‌ ట్రెండూ

Published : 22 Feb 2020 00:19 IST

ఫ్యాషన్‌

కొండగాలులు వెచ్చగా మారుతూ.. ముఖానికి ఎండ తగిలే కాలంలోకి మెల్లగా అడుగు పెట్టేస్తున్నాం. దీంతో ఫ్యాషన్‌ ట్రెండూ అందుకు తగ్గట్టుగా మారిపోతోంది.. మీ ఫ్యాషన్‌ సంగతేంటి? పంథాని మార్చుకోవాల్సిందే. వచ్చే సమ్మర్‌కి సిద్ధం అవ్వాల్సిందే. వేసవి అనగానే మొదటగా గుర్తొచ్చేది.. క్యాప్‌లు. ఎండ నుంచి ముఖానికి రక్షణకే కాదు. జట్టుపై దుమ్ము, ధూళి పడకుండా కాపాడతాయి. అంతేకాదు ట్రెండీ లుక్‌ కూడా. మరైతే, ఇప్పుడు టోపీల ట్రెండ్‌ ఏంటయ్యా? అంటే.. ‘బేస్‌బాల్‌ క్యాప్‌లు’. అదే నడుస్తోందిప్పుడు. మరి కుర్రకారు అందాన్ని మరింత పెంచే ఈ ట్రెండీ బేస్‌బాల్‌ క్యాప్‌లపై మనమూ ఓ లుక్కేద్దాం.●

స్నాప్‌బ్యాక్‌, ట్రకర్‌, స్పోర్ట్స్‌ క్యాప్‌ ఇలా అనేక రకాల స్టైల్స్‌లో ఈ బేస్‌బాల్‌ క్యాప్స్‌ లభిస్తున్నాయి. క్యాప్‌ రంగు, ప్రింట్‌, లోగో ఇలా ఏవైనా చూడగానే ఆకట్టుకునేలా, ధరించేందుకు సౌకర్యంగా ఉండే క్యాప్‌లనే ఎంచుకోండి●

బాలీవుడ్‌ సినిమాల పేర్లతోనూ టోపీలు మార్కెట్‌లో సందడి చేస్తున్నాయి. ప్రయత్నించి చూడండి. ●

అన్నీ మీ బుర్రకి సరిపడేవి ఉండకపోవచ్ఛు అందుకే మీకు ఫిట్‌ అయ్యే టోపీనే ప్రయత్నించండి. టైట్‌గా ఉంటే ఎక్కువ సమయం ధరించినప్పుడు చిరాకుగా అనిపించొచ్ఛు మరీ వదులుగా ఉంటే ప్రతిసారీ అడ్జెస్ట్‌ చేసుకోవాల్సి వస్తుంది. అందుకే ఎంచుకునే ముందే మీ తలకి సరిగా సరిపోయేది ఎంపిక చేసుకోండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని