జుట్టు మెరుస్తుంది..

ఇప్పుడొక నయా ఫ్యాషన్‌ మొదలైంది. అదేంటో తెలుసా ‘సిల్వర్‌ ఫాక్స్‌’. అంటే.. ఒకప్పుడు ఎక్కడ వయసు ఎక్కువగా...

Published : 21 Mar 2020 00:14 IST

ఫ్యాషన్‌

ప్పుడొక నయా ఫ్యాషన్‌ మొదలైంది. అదేంటో తెలుసా ‘సిల్వర్‌ ఫాక్స్‌’. అంటే.. ఒకప్పుడు ఎక్కడ వయసు ఎక్కువగా కనిపిస్తుందో అని బూడిదరంగు జుట్టుకు కాస్తా రంగేసేసేవారు. కానీ ఇప్పుడు జమానా మారింది. తళతళ మెరిసే సిల్వర్‌ జుట్టే నయా ట్రెండ్‌. అలా రఫ్‌గా సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ లుక్‌తో తెగ మెరిసిపోతున్నారు నేటితరం. కేవలం జుట్టే కాదు గడ్డం కూడా.. నలుపు, బూడిద రంగు షేడ్స్‌తో క్లాసిక్‌ లుక్‌లోకి మారి మురిసిపోతున్నారు. సెలబ్రిటీలు హృతిక్‌ రోషన్‌, అక్షయ్‌ కుమార్‌, తమిళ హీరోలు అజిత్‌, విక్రమ్‌.. వీరే కాదు. హాలీవుడ్‌, బాలీవుడ్‌ నటులతో పాటు ఎంఎస్‌ ధోనీ లాంటి క్రికెటర్స్‌, క్రీడాతారలు వారివారి సినిమాల్లో, ఇతర కార్యక్రమాలలో దీన్ని ఫాలో అవుతూ నయా ట్రెండ్‌ని ట్రెండింగ్‌లోకి తెస్తున్నారు. ఇక మీరూ మీ జుట్టు తెల్లబడుతుంది, గడ్డం బూడిద రంగుతో మెరుస్తుందని భయపడనక్కర్లేదు.. రంగు జోలికి పోనక్కర్లేదు.. మెరిసేజుట్టుతో మీరూ మెరవండి. కేవలం అబ్బాయిలే కాదు.. అమ్మాయిలూ ఇప్పుడీ గ్రే ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో వారి ఫొటోలను ఉంచుతూ నయా ట్రెండ్‌కి నాంది పలుకుతున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని