మీరు చారల.. తారలే

వేసవి మొదలయ్యింది. ఒకటే ఉక్కపోత.. చెమటలు. అందుకే  వీలైనంత పల్చటి, మెత్తగా ఉండే దుస్తుల్ని ధరించేందుకు ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా యువత టీషర్టులకే మొగ్గుచూపుతారు.

Published : 28 Mar 2020 04:08 IST

ఫ్యాషన్‌

వేసవి మొదలయ్యింది. ఒకటే ఉక్కపోత.. చెమటలు. అందుకే  వీలైనంత పల్చటి, మెత్తగా ఉండే దుస్తుల్ని ధరించేందుకు ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా యువత టీషర్టులకే మొగ్గుచూపుతారు. వాటితోనే ట్రెండీ లుక్‌లో అదరగొట్టాలి అనుకుంటారు. మరైతే, టీషర్టులు ఏవి ఎంపిక చేసుకోవాలి. ఇవిగోండి.. ‘నాటికల్‌ స్ట్రిప్స్‌’ టీషర్టులు. ఏదైనా రంగుపై చారల్లా కనిపించేవే ఈ నాటికల్‌ స్ట్రిప్‌లు.  ఎక్కువగా నీలి, తెలుపు రంగుల కాంబినేషన్‌లో యువత దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. వీటిపై డెనిమ్‌ జీన్స్‌ షార్ట్స్‌ వేస్తే ట్రెండీ లుక్‌ మీ సొంతమవుతుంది. ఫ్రెండ్స్‌తో షికార్లకు వెళ్లేప్పుడు పలు రంగుల షార్ట్‌లపై వీటిని ధరిస్తే స్టైల్‌తో పాటు సౌకర్యంగానూ ఉంటుంది. వీటిపై స్టైలిష్‌ బేస్‌బాల్‌ క్యాప్‌, సన్‌ గ్లాసెస్‌, ఇక కాళ్లకి లోపర్‌ లేదా స్నిక్కర్స్‌, చేతికో స్టైలిష్‌ స్మార్ట్‌వాచ్‌ ధరిస్తే అందరి కన్నూ మీ మీదే!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని