పైజామాకే ఓటు..

ఇప్పుడు అన్ని రంగాలతో పాటు ఫ్యాషన్‌ ప్రపంచమూ మారుతోంది. కాలేజీ, ఆఫీసులకెళితే అదిరే...

Published : 09 May 2020 00:48 IST

ఫ్యాషన్‌

ప్పుడు అన్ని రంగాలతో పాటు ఫ్యాషన్‌ ప్రపంచమూ మారుతోంది. కాలేజీ, ఆఫీసులకెళితే అదిరే లుక్‌తో ట్రెండీగా కనిపించే కుర్రకారు ఇప్పుడు ఇంటికే పరిమితమయ్యారు. ఇంటి నుంచే పని చేస్తున్నారు. అలాగని నయాట్రెండ్‌ ఫాలో అవ్వట్లేదనుకుంటే పొరపాటే. ఇంట్లోనూ అదిరే ఫ్యాషన్‌తో క్లాస్‌ లుక్‌లోకి మారిపోతున్నారు. అందుకు వారి ఫ్యాషన్‌ డ్రెస్సింగ్‌ ఇలా మార్చేసుకున్నారు. జీన్స్‌ కాస్త పైజామాలయ్యాయి. షర్ట్‌ కాస్తా ‘ఓవర్‌ సైజ్‌డ్‌’కి వెళ్లాయి. అవును ఇప్పుడు పైజామాల ట్రెండే తెగ నడుస్తోంది. కంఫర్ట్‌తో పాటు ఆకట్టుకునే లుక్‌ వీటి సొంతం. కేవలం పని చేసేప్పుడు మాత్రమే కాదు. ఫ్రెండ్స్‌తో వీడియో కాల్‌ మాట్లాడొచ్ఛు వాటికి మరి కాస్త ఫార్మల్‌ టచ్‌ జోడిస్తే బాస్‌తో కాన్ఫరెన్స్‌ మాట్లాడేటప్పుడూ సౌకర్యమే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని