మోడ్రన్‌ సంప్రదాయంతో..

ఈ రోజే కాదు. వచ్చేదంతా పండగల సీజన్‌. మరి అమ్మాయిలకు పోటీగా అబ్బాయిలు పండగ హడావిడి చేద్దామనుకుంటే.. సంప్రదాయ దుస్తులకు ఓటేస్తూనే.. కాస్త మోడ్రన్‌గా కనిపించే ప్రయత్నం

Published : 14 Nov 2020 00:14 IST

ఈ రోజే కాదు. వచ్చేదంతా పండగల సీజన్‌. మరి అమ్మాయిలకు పోటీగా అబ్బాయిలు పండగ హడావిడి చేద్దామనుకుంటే.. సంప్రదాయ దుస్తులకు ఓటేస్తూనే.. కాస్త మోడ్రన్‌గా కనిపించే ప్రయత్నం చేయవచ్చు. ముఖ్యంగా ‘ఇండో-వెస్టర్న్‌ స్టైల్స్‌’తో సందడి చేయటానికి సిద్ధం అయిపోండి. అందులోనూ కుర్తా, షేర్వాణీలు అయితే పండగ కళంతా మగమహారాజులదే. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ హుందాగా కుర్తా-పైజామాతో నయా లుక్‌లో కనిపించాలంటే మార్కెట్‌లోకి కొత్తగా వచ్చిన డిజైన్స్‌ ఫాలో అవ్వాల్సిందే. ఆధునిక పోకడలకు సరిపడేలా జాకెట్‌ స్టైల్‌లోనూ కుర్తాల్ని ధరించొచ్చు. జిగేల్‌ మనే రంగుల్లో ప్రీమియం బెనారసీ సిల్క్‌ జాకెట్‌ కుర్తాలు పండగ సందడికి చక్కని ఎంపిక. ఒకే రంగు కుర్తా-పైజామాలపై సిల్క్‌ జాకెట్‌ వేస్తే అదిరే లుక్‌ మీ సొంతం. ఇక షేర్వాణీల్లో వెండి, బంగారు వర్ణంతో కలగలిపి డిజైన్‌ చేసినవైతే ఆ లుక్కే వేరు. ఎగుడు దిగుడు అంచులతో వస్తున్న కుర్తాలే ఇప్పుడు ఫ్యాషన్‌. అలాగే, కుర్తా-పైజామాపై నెహ్రూ జాకెట్‌ కూడా మంచి ఎంపికే. ఒకవేళ మరీ అంత సంప్రదాయంగా వద్దనుకుంటే క్యాజువల్‌గా జీన్స్‌పైనా కుర్తాల్ని ధరించొచ్చు. ఎగుడు దిగుడు అంచులతో ముదురు రంగు కుర్తాలైతే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని