Updated : 30 Jan 2021 06:34 IST

ఫ్యాషన్లు.. పక్కా లోకల్‌

కరోనా కనుమరుగవుతుండగా  ఫ్యాషన్లు పరుగు అందుకుంటున్నాయి. యూత్‌ సొగసుల జోరు పెంచేస్తున్నారు. తమకు నచ్చిన డిజైనర్‌ దుస్తులతో క్యాట్‌వాక్‌ చేసేస్తున్నారు. ఇంతకీ వాళ్లు ఏ స్టైల్‌ని ఎక్కువగా ఆదరిస్తున్నారంటే..
ఫ్యాబ్రిక్‌: కరోనా తర్వాత డిజైనర్లు, యూత్‌ ఆర్గానిక్‌ ఫ్యాబ్రిక్‌పై దృష్టి పెడుతున్నారు. ఒంటికి సౌకర్యంగా ఉండే చేనేత కాటన్‌, లెనిన్‌ ఫ్యాబ్రిక్‌ని ఆదరిస్తున్నారు.
ఆధునికంగా: పోచంపల్లి, నారాయణ్‌పేట్‌, మంగళగిరి నేత కళాకారులు సృష్టించే చేనేత కాటన్‌ సంప్రదాయానికి చిరునామా. కానీ మన స్టైలిష్ట్‌లు వీటితోనే పాశ్చాత్య తరహాలో డిజైన్లు రూపొందిస్తున్నారు.
డిజైన్స్‌: ప్రస్తుతం అబ్బాయిలు హై-వెయిస్ట్‌ ప్యాంట్లకు ఓటేస్తున్నారు. 1990లలో ఓ ఊపు ఊపిన బ్యాగీ స్టైల్‌ ప్యాంట్లు మళ్లీ వచ్చేశాయి. ఈసారి కొంచెం సైజు తగ్గించి స్టైల్‌ పెంచారు.
యాక్సెసరీలు: వేసుకునే డ్రెస్‌ రంగులకు అచ్చంగా అపోజిట్‌ కలర్‌ కాంట్రాస్ట్‌ బూట్లు, యాక్సెసరీలు ఇప్పుడు ఫ్యాషన్‌. యెల్లో, బ్రౌన్‌ అమ్మాయిలు ఇష్టపడే హ్యాండ్‌బ్యాగ్‌లు. మోకాలు పైకి దాటిన బూట్లు జోరు మీదున్నాయి.
భళా స్టైల్‌: నడుముపైకి ఎక్కిన హై-వెయిస్ట్‌ జీన్స్‌ని బాగా ఇష్టపడుతున్నారు. ఇందులో పేపర్‌ బ్యాగ్‌ ప్యాంట్లు బాగా పాపులర్‌. దీనికి జతగా షోల్డర్‌ ప్యాడెడ్‌ షర్ట్‌లను అమ్మాయిలు తెగ ఆదరిస్తున్నారు. కాస్త ఆధునికంగా కనిపించాలి, ఇందులో వెరైటీ కావాలనుకునేవాళ్లు జతగా బ్లేజర్లకు ఒంటిపై చోటిస్తున్నారు.

- హేమంత్‌ సిరి, ఫ్యాషన్‌ డిజైనర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు