మీ స్టైల్ ఎత్తు పెంచండి
ఫ్యాషన్ మంత్ర
ఎత్తు తక్కువ ఉంటేనేం? స్టైల్‌తో ఎంతో ఎత్తుకు ఎదగాలనుకునే అమ్మాయిలుంటారు. పొడుగు లేకపోతేనేం.. దుస్తులు ధరించే విషయంలో ఎవరికీ ఏమాత్రం తీసిపోవద్దు అనుకుంటారు. అలా భావించే కురచ అమ్మాయిలు కొన్ని చిట్కాలు పాటిస్తే స్టైల్‌కి స్టైల్.. ఎత్తుగానూ కనిపిస్తారు.
ఒకే రంగు: అమ్మాయి ఎత్తుగా కనిపించాలంటే మొదటి షరతు తల నుంచి పాదాల దాకా ఒకే రంగు డ్రెస్ వేసుకోవాలి. ఒకే రంగులోనూ ముదురు రంగులు వాడితే ‘వెర్టికల్ ఎఫెక్ట్’తో అమ్మాయిలు సన్నగా, ఎత్తుగా కనిపిస్తారు.
పాదరక్షల పాత్ర: ఎత్తుగా కనిపించడం మన లక్ష్యం అయితే బాటమ్ లేదా ప్యాంట్‌తో జతయ్యే రంగు షేడ్ ఉన్నవి ఎంచుకోవాలి. ఇలా చేసినప్పుడు నడుము నుంచి పాదాల దాకా అతుకుల్లేకుండా ఉన్నట్టుగా అనిపించి ఎత్తుగా కనిపిస్తారు.
యాక్సెరీలు: పొడవాటి హ్యాండ్‌బాగ్‌లు కురచ అమ్మాయిల్ని మరింత పొట్టిగా కనిపించేలా చేస్తాయి. పర్సులు, బ్యాగ్‌లు చిన్నవి, మధ్యస్థమైన సైజువే ఎంచుకోవాలి. ప్యాంట్ల మీద బెల్టులు ధరించే అలవాటుంటే అవి సన్నటి రకమై ఉండాలి.
సరైన పరిమాణం: ఎత్తు తక్కువగా ఉన్న అమ్మాయిలు షర్టులు, టీషర్టులు, టాప్స్, జాకెట్స్.. ఏవైనా వదులుగా ఉన్నవాటికి దూరంగా ఉండాలి. ఓవర్ సైజ్డ్ దుస్తులు వేసుకుంటే మరీ పొట్టిగా, లావుగా కనిపిస్తారు. డిజైన్స్ సరైన సైజువి, లేదంటే కాస్త బిగుతుగా ఉన్నా ఫర్వాలేదు. స్కిన్ జీన్స్ మంచి ఛాయిస్.
- షణ్మిత గాయత్రి, ఫ్యాషన్ డిజైనర్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
CM Jagan: ‘గోరుముద్ద’ మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు అడుగులు: సీఎం జగన్
-
India News
Amritpal Singh: ‘80 వేల మంది పోలీసులు ఏం చేస్తున్నారు?’.. అమృత్‌పాల్ పరారీపై న్యాయస్థానం ఆగ్రహం
-
Politics News
Srinivas Goud: పారిపోయినోళ్లను వదిలేసి మహిళపైనా మీ ప్రతాపం?: శ్రీనివాస్‌గౌడ్
-
Sports News
IND vs PAK: మా జట్టుకు బెదిరింపులు వచ్చాయి.. అయినా అప్పుడు మేం వచ్చాం: అఫ్రిది
-
India News
Modi-Kishida: కిషిదకు పానీపూరీ రుచి చూపించిన మోదీ
-
India News
Amruta Fadnavis: 750 కిలోమీటర్ల ఛేజింగ్.. ఆపై క్రికెట్ బుకీ అరెస్టు