ఎండల్లో.. చల్లచల్లని సొగసులు
నయా ఫ్యాషన్
కాలాలెన్ని మారినా ఫ్యాషన్లకు అనుకూలమే అన్నది స్టైలిస్ట్‌ల మాట. ఈ వేసవిలోనూ సొగసుల పరుగు కొనసాగించాలనుకుంటే ఇవిగోండి ఔట్‌ఫిట్‌లు. కూల్‌గా, స్టైల్‌గా దూసుకెళ్లండి మరి.
* ఈ సమ్మర్‌లో యువత ఆదరించాల్సిన మరో కాంబినేషన్ చినోస్, షార్ట్‌లు. వీటిలో ఖాకీ రంగుకు ఓటేయొచ్చు. ఈ డిజైన్స్‌కి జతగా ఫ్లోరల్ చొక్కాలు వేసి టక్ చేయకుండా వదిలేస్తే అమ్మాయిల చూపులు కుర్రాళ్లపై పడటం ఖాయం. పార్టీలు, క్యాజువల్‌వేర్‌కి ఈ స్టైల్ నప్పుతుంది.
* సౌకర్యంతోపాటు ఆధునికంగా కనిపించాలనుకునే అబ్బాయిలు ట్యాంక్ టాప్ టీషర్టులు, బకెట్ స్టైల్ టోపీలతో చెలరేగిపోవచ్చు. వీటిపై ఓవర్‌సైజ్డ్ ఫ్లోరల్ టాప్‌లు వేస్తే ఫ్యాషన్ మోడళ్లకి ఏమాత్రం తగ్గకుండా అందంగా కనపడతారు. ఈ ఔట్‌ఫిట్ వేసి అలా అలా తిరిగేస్తుంటే.. సొంతింట్లో ఉన్నా గోవా బీచ్‌లో హాయిగా సేద తీరుతున్నట్టుగా ఉంటుందంటారు ఫ్యాషనిస్ట్‌లు.
* స్టైల్‌కి స్టైల్ కూల్ సౌకర్యం కావాలనుకుంటే ఫ్లోరల్ చొక్కాలకు జతగా రిప్డ్ జీన్స్ వేసి తీరాల్సిందే. రోజువారీ వాడకానికి, పార్టీవేర్.. దేనికైనా నప్పుతాయి. సౌకర్యవంతంగానూ ఉంటాయి. వీటికి జతగా సన్‌గ్లాస్‌లు, రిస్ట్‌వాచీలు పెడితే కుర్రాళ్లు స్టైల్ ఐకాన్లుగా మారిపోవడం ఖాయం.
* సాధారణ వినియోగానికి ఫ్లోరల్ చొక్కాలు సరే.. కార్పొరేట్ మీటింగ్‌లకు, కాస్త హుందాగా కనిపించాలి అనుకునే వారి పరిస్థితి ఏంటని అడిగితే.. ఫ్లోరల్ చొక్కాలపై ఫార్మల్ సూట్లు వేసుకుంటే సరి. వీటికి జతగా తెలుపు రంగు స్నీకర్లు వేస్తే మీ స్టైల్‌తో మరో మెట్టు ఎక్కేస్తారు.
* ఈ వేసవిలో వేడి నుంచి దూరంగా ఉంచే మరో స్టైలిష్ డ్రెస్ డెనిమ్స్. ఈ తరహా చొక్కాలు, జీన్స్.. రెండూ ఒంటికి హాయిగా ఉంటాయి. ఇందులో పేస్టల్ కలర్ ప్యాంట్లు, చినోస్, షార్ట్‌లు.. సౌకర్యంగా, సొగసుగా ఉంటాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
అలా మాట్లాడితే.. కేజ్రీవాల్‌పై పరువు నష్టం దావా వేస్తా: సీఎం హిమంత హెచ్చరిక
-
General News
AP High court: అధికారుల వైఖరి దురదృష్టకరం.. వారిని జైలుకు పంపాలి: హైకోర్టు
-
Movies News
IPL 2023: ఐపీఎల్ వేడుకల్లో రష్మిక, తమన్నా హంగామా.. ‘నాటు’ స్టెప్పులు అదుర్స్ అనాల్సిందే!
-
World News
Heartbreaking Story: మా అమ్మ కన్నీటితో డైరీలో అక్షరాలు తడిసిపోయాయి..!
-
World News
ఎయిర్‌పోర్ట్‌లో లగేజ్ మాయం..ఎయిర్టాగ్తో నిందితుడిని గుర్తించిన ప్రయాణికుడు
-
Movies News
Jagapathi Babu: అడవిని తలపించే ఇల్లు.. జగపతి బాబు తల్లి జీవన విధానమిది