తారలు దిగి వచ్చిన వేళ..
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్. సినిమా అవార్డుల పండగే కాదు.. తారల కవ్వించే అందాలు కొలువయ్యే చోటు కూడా. అభిమానులను ఆకట్టుకోవడానికి స్టార్లు ఇక్కడ సోయగాల విందు చేస్తారు. సరికొత్త సొగసుల దుస్తులను తమ ఒంటిపై చోటిస్తారు. ఈ ప్రతిష్ఠాత్మక వేదికపై తమదైన ముద్ర వేయాలని పరితపిస్తారు. హాలీవుడ్ తారాగణం, సాంకేతిక నిపుణులు, సూపర్ మోడళ్లు.. రెడ్‌కార్పెట్‌పై అందరిదీ ఇదే బాట. పైగా గతేడాది సందడి లేదు. ఆ లోటును భర్తీ చేస్తూ .... రోజుల సంరంభంలో మరింతగా మురిపిస్తున్నారు. ఆ విశేషాలు..
* సూపర్ మోడల్ బెల్లా హడీడ్ ప్రఖ్యాత డిజైనర్ జీన్ పాల్ గాల్టియర్ రూపొందించిన ఫిగర్ హగ్గింగ్ గౌన్ ధరించి హొయలు పోయింది. హల్టర్ నెక్ డిజైన్‌కి తోడు వజ్రాల చెవి రింగులు, స్టేట్మెంట్ రింగ్స్ ధరించి షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
* పాప్ సింగర్ కార్లా బ్రూనీ వన్ షోల్డర్ గౌనుతో అదరగొట్టింది. కవ్వించేలా మోకాలిపైకి చీలిన ఈ స్లిట్ గౌను కెమెరాలను కట్టిపడేసింది. దీనికితోడు చేతిలో సిల్వర్ పర్స్‌తో హుందాగా నడిచొస్తుంటే అంతా ఫిదా అయిపోయారు.
* జర్మన్ ఇన్‌ఫ్లూయెన్సర్ లియోనీ హన్నే హాలీవుడ్ తారల్ని తలదన్నే స్టైల్‌తో మెప్పించింది. స్టార్ డిజైనర్ నికోల్ ఫెలీసియా డిజైన్ చేసిన ముదురాకుపచ్చ టుల్డ్ ఫ్రాక్ ధరించింది. స్లీవ్‌లెస్, వీ ఆకారపు నెక్ డిజైన్‌తో చూపరుల మతులు పోగొట్టింది. ఈ డ్రెస్‌కి అక్కడక్కడ కూర్చిన తెలుపు రంగు ఈకలు మరో ఆకర్షణ.
* జెస్సికా చస్టెయిన్ నలుపు రంగు డ్రెస్‌తో ఆకట్టుకుంది. హృదయాకారపు నెక్‌లైన్ కట్, లేయర్డ్ టుల్డ్ డిజైన్, వెల్వెట్ లైన్లతో బెస్ట్ డ్రెస్ అంటూ ప్రశంసలు అందుకుంది.
* రోజ్ గోల్డ్ జంప్‌సూట్‌తో కేన్స్‌లో అందరి చూపు తనపై నిలుపుకున్న మగువ క్యాండిస్ స్వేన్‌పోల్. ఫ్లోరల్ మోతిఫ్స్ ఎంబ్రాయిడరీ చేయించి వాటిపై బీడ్స్, రైన్‌స్టోన్స్, మెటాలిక్ మెరుపులతో సందడి చేసింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Manisha Koirala: ఆ సినిమా భారీ వైఫల్యంతో నా కెరీర్ ముగిసిపోయింది: మనీషా
-
Crime News
Temple Tragedy: ఆలయంలో మెట్లబావి ఘటన.. 35కి చేరిన మృతులు
-
Crime News
సర్ప్రైజ్ గిఫ్ట్.. కళ్లు మూసుకో అని చెప్పి కత్తితో పొడిచి చంపారు!
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Crime News
Couple Suicide: నిస్సహాయ స్థితిలో దంపతుల ఆత్మహత్య!
-
Politics News
EC: వయనాడ్ ఖర్చులు సమర్పించని ‘రాహుల్’పై ఈసీ వేటు!