నయా సాల్..నడిచొచ్చే స్టైల్..
జీన్ యాంగ్, మిక్కీ ఫ్రీమ్యాన్, ఆండ్రూ గెల్విక్స్, లిండ్సే డుపీస్, క్రిస్టా రోజర్...ఎవరు వీళ్లంతా? హాలీవుడ్ సోగ్గాళ్లకి దుస్తులు రూపొందించే డిజైనర్లు. 2022లో పరుగులు పెట్టబోయే ఫ్యాషన్లు, ఔట్‌ఫిట్‌ల గురించి చెబుతున్నారు.
మెటా ప్యాంట్‌లు: భవిష్యత్తులో ఇవి జీన్స్‌కి ప్రత్యామ్నాయంగా మారబోతున్నాయి. వీటికి సాగుడు గుణం ఉండటంతో ఒంటికి సౌకర్యంగా ఉంటాయి. ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి. ధర ఎక్కువేం కాదు. చూడ్డానికి స్టైలిష్‌గానూ ఉంటాయి.
అల్లిక బెల్ట్‌లు: జీన్స్, ట్రౌజర్స్.. వేటిపై అయినా సౌకర్యంగా అమరుతాయి ఈ అల్లిక బెల్ట్‌లు. బరువు పెరిగినా, తగ్గినా, సైజు మారినా ఆకారంలో ఎలాంటి తేడాలు రావు. ఏళ్లపాటు మన్నికగా ఉంటాయి.
ప్లీటెడ్ డ్రెస్ ప్యాంట్‌లు: కొన్నాళ్లుగా ‘స్లిమ్మర్’ ప్యాంట్లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. వీటిని పోలినవే ప్లీటెడ్ డ్రెస్ ప్యాంట్లు. నడుము, తొడల భాగంలో వదులుగా ఉండి.. కిందికి వచ్చేకొద్దీ బిగుతుగా ఉండటం వీటి ప్రత్యేకత. మధ్యలో చిన్నపాటి ‘డ్రేప్స్’ ఆకర్షణీయంగా ఉంటాయి. టీషర్టులు, చొక్కాలకు ఇవి సరిజోళ్లు.
కార్డిగాన్ కోట్లు: ఈ శీతకాలంలో కార్డిగాన్ స్వెటర్లు కుర్రాళ్ల ఒంటిని చుట్టేశాయి. అదే ఊపులో కార్డిగాన్ కోట్లు వచ్చేసి కొత్త స్టైల్‌కి చిరునామాగా మారబోతున్నాయంటున్నారు ఫ్యాషనిస్ట్‌లు. జీన్స్, షార్ట్స్ వేటికి జతగా అయినా వేసుకోవచ్చు.
షార్ట్‌లు: చూడ్డానికి ఆధునికంగా, వేసుకుంటే సౌకర్యంగా ఉండాలనుకునే కుర్రాళ్లు ఇప్పటికే వీటిని బాగా ఆదరిస్తున్నారు. రాబోయే రోజుల్లోనే వీటి హవా కొనసాగుతుందంటున్నారు డిజైనర్లు.
స్లీవ్‌లెస్ బ్లేజర్లు: పండగలు, పార్టీల్లో హుందాగా కనిపించాలనుకునే అబ్బాయిలు బ్లేజర్లకు ఓటేయడం మామూలే. ఈ ఏడాది స్లీవ్‌లెస్ బ్లేజర్లు సందడి చేయబోతున్నాయంటున్నారు ఫ్యాషన్ పండితులు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Espionage: రష్యాలో అమెరికన్ జర్నలిస్టు అరెస్టు.. ప్రచ్ఛన్న యుద్ధానంతరం మొదటిసారి!
-
India News
Divya Spandana: అప్పుడు రాహులే నాకు మానసిక ధైర్యం ఇచ్చారు: నటి వ్యాఖ్యలు
-
Movies News
Social Look: వాణీకపూర్ ‘క్రైమ్ థ్రిల్లర్’.. చీరలో శోభిత హొయలు!
-
India News
Amritpal Singh: నేను పోలీసులకు లొంగిపోవడం లేదు.. త్వరలోనే ప్రజల ముందుకొస్తా: అమృత్‌పాల్ సింగ్
-
Sports News
IPL 2023: ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా హ్యారీ బ్రూక్ నిలుస్తాడు: ఇంగ్లాండ్ మాజీ పేసర్
-
India News
Rajasthan: ‘గహ్లోత్‌జీ వారి మొర ఆలకించండి’.. ప్రైవేట్ వైద్యులకు సచిన్ పైలట్ మద్దతు!