పరిమళానికీ.. ఓ పద్ధతి!

యూత్‌ అన్నాక స్టైల్‌గా ఉంటారు. టిప్‌టాప్‌గా తయారవుతారు. అన్నిరకాల మెరుగులు దిద్దుకున్నాక ఆఖర్న బాడీ స్పేనో, పెర్‌ఫ్యూమ్‌నో.. చల్లుకుంటారు. అప్పటికిగానీ అలంకరణ పూర్తవదు. అయితే ఈ

Updated : 12 Aug 2022 15:10 IST

యూత్‌ అన్నాక స్టైల్‌గా ఉంటారు. టిప్‌టాప్‌గా తయారవుతారు. అన్నిరకాల మెరుగులు దిద్దుకున్నాక ఆఖర్న బాడీ స్ప్రేనో, పెర్‌ఫ్యూమ్‌నో.. చల్లుకుంటారు. అప్పటికిగానీ అలంకరణ పూర్తవదు. అయితే ఈ పరిమళాలు ప్రభావవంతంగా, ఎక్కువ సమయం వెదజల్లాలంటే శరీరతత్వానికి అనుగుణంగా స్ప్రే చేసే ప్రాంతాల్ని ఎంచుకోవాలంటారు స్టైలిస్ట్‌లు. వారు చెబుతున్న దాని ప్రకారం...

* చలువ శరీరం: ముంజేయి తగిలేచోట నడుము పక్కన.. మోచేతుల లోపలివైపు.. ఈ ప్రాంతాల్లో స్ప్రే చేయాలి.

* సాధారణం: ఛాతి, మణికట్టు ఈ భాగాల్లో పెర్‌ఫ్యూమ్‌ చల్లుకోవాలి.

* వేడి శరీరం: మెడ, భుజాలు, గవద కింది భాగంలో వీటిని రాసుకోవాలి.

* ఎంపిక: కొంతమందికి కొన్నిరకాల ఘాటైన స్ప్రే వాసనలు పడవు. కొన్నిరకాల అలర్జీలు కూడా కలగజేస్తాయి. మార్కెట్లో వీటిని కొనేముందే ఓసారి చేతిపై చల్లుకొని పరీక్షించుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని