ప్రేమికులకు ద్వేషంతో..
ప్రేమ.. రెండక్షరాల మహా కావ్యం. ప్రేమ.. సృష్టి సైతం కనలేని విరహం. ప్రేమ.. పుట్టుక, చావులకు అతీతమైన అనుభవం. ప్రేమ.. కాలం కూడా స్పర్శించలేని రూపం. ప్రేమ.. ప్రాణవాయువై మనిషిని నడిపించే దివ్య మంత్రం. ప్రేమ వేయి జన్మలకు సరిపడే జ్ఞాపకాల భాండాగారం...
ప్రేమ గురించి మాటల్లో ఏం చెప్పగలం? అక్షరాల్లో ఎలా రాయగలం? అనుభూతిని ఏమని వర్ణించగలం? ప్రేమ వర్షంలో తడిసి ముద్దవడం తప్ప. అదొక అగ్ని. అదొక తపస్సు. అదొక దైవ దర్శనం. విశ్వవ్యాప్తమైన ప్రేమను ఎలా కొలవగలం? ఈ గుప్పెడంత గుండె సరిపోతుందా? ప్రత్యామ్నాయం ఇంకొకటుందా? ప్రేమ ఊహల్లో బందీగా మారడం తప్ప. అదొక పద్మవ్యూహం.. తీరని దాహం. ఆకాశమంత ప్రేమను అందుకోవాలని ప్రతిక్షణం తపించే హృదయాలకు, విడివడలేని ప్రేమ పక్షులందరికీ ‘ప్రేమికుల రోజు’ శుభాకాంక్షలు.
- రాజేష్.ఎం
ప్రేమలో పడ్డ వారికి రోజూ పండగే! మరి ప్రేమ గిట్టనివారికి? అదో దండగ వ్యవహారం. ప్రేమికులకు ఫిబ్రవరి 14 ‘వేలంటైన్స్ డే’ అయితే ప్రేమ విద్వేషులది ‘యాంటీ వేలంటైన్స్ డే’. వాళ్లు ‘రోజ్ డే..’, ‘ప్రపోజ్ డే’ అని సంబరాలు చేస్తే.. వీళ్లు.. ‘స్లాప్ డే’, ‘బ్రేకప్ డే’ అంటూ సవాల్ చేస్తున్నారు. కొన్నాళ్లుగా జోరందుకుంటున్న ఈ ట్రెండ్ సంగతేంటని ఆరా తీస్తే ఆ వివరాలు, ఆ వారోత్సవాల ఉద్దేశాలు ఇవి.
ఫిబ్రవరి 15: స్లాప్ డే: ఒక్కరిపైనే వలపు.. ఒక్కరి కోసమే బతుకు అనే సెంటిమెంట్‌కి చెంపదెబ్బ కొట్టడమే ఈ రోజు ఉద్దేశం. ప్రేమలో పడకపోతే చులకనైపోతాం, ఏదో కోల్పోతాం అనే ప్రతికూల ఆలోచనలనూ ఈడ్చి కొట్టాలంటారు.
ఫిబ్రవరి 16: కిక్ డే: ప్రేమ పేరిట ఇచ్చిపుచ్చుకున్న బహుమతులు విసిరిపారేయడం.. లవ్ మిగిల్చిన చికాకులు, ఒత్తిళ్లు తన్ని తగిలేయడమే కిక్ డేకి ఇచ్చే నిర్వచనం అంటారు ప్రేమంటే గిట్టనివారు.
ఫిబ్రవరి 17: పర్‌ఫ్యూమ్ డే: ప్రేమ మైకం వదిలించుకొని, జీవితానికి ఆనందాల అత్తరు అద్దుకోవాలి.. సంతోషాల రంగులు రాసుకోవాలి. బతుకంతా ఆనందపు సువాసనలు వెదజల్లాలి అని భావం.
ఫిబ్రవరి 18: ఫ్లర్ట్ డే: లవ్‌కి లాగి లెంపకాయ కొట్టాలి. కొత్త వ్యక్తులను కలవాలి. వాళ్లని మాటలతో కవ్వించాలి. చేతలతో మెప్పించాలి. మనసు గెల్చుకునేలా దోస్తీ చేయాలి.
ఫిబ్రవరి 19: కన్ఫెషన్ డే: ప్రేమ తప్పుల్ని ఓసారి మననం చేసుకోవాలి. పశ్చాత్తాపం చెందాలి. భవిష్యత్తులో మళ్లీ ఇలా జరగొద్దని ఓ నిర్ణయం తీసుకోవాలి.
ఫిబ్రవరి 20: మిస్సింగ్ డే: ప్యార్‌లో పడినప్పుడు ఏం కోల్పోయామో వివరిస్తూ పాత బోయ్‌ఫ్రెండ్/గాళ్‌ఫ్రెండ్‌కి సందేశాలు పంపడం. సామాజిక మాధ్యమాల్లో సందేశాలతో నింపేయడం.
ఫిబ్రవరి 21: బ్రేకప్ డే: వలపు సంగతులకు బై చెప్పేయడం. చింతలు, చికాకులు, పాత అనుభవాలు, జ్ఞాపకాలు.. మనసులోంచి, మెదడులోంచి తుడిపేస్తూ ప్రేమ అనే పదానికి బ్రేకప్ చెప్పి భారం దించేసుకోవడం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Zelensky: ‘బుచా’ హత్యాకాండకు ఏడాది.. దోషులను ఎప్పటికీ క్షమించం!
-
Politics News
అలా మాట్లాడితే.. కేజ్రీవాల్‌పై పరువు నష్టం దావా వేస్తా: సీఎం హిమంత హెచ్చరిక
-
General News
AP High court: అధికారుల వైఖరి దురదృష్టకరం.. వారిని జైలుకు పంపాలి: హైకోర్టు
-
Movies News
IPL 2023: ఐపీఎల్ వేడుకల్లో రష్మిక, తమన్నా హంగామా.. ‘నాటు’ స్టెప్పులు అదుర్స్ అనాల్సిందే!
-
World News
Heartbreaking Story: మా అమ్మ కన్నీటితో డైరీలో అక్షరాలు తడిసిపోయాయి..!
-
World News
ఎయిర్‌పోర్ట్‌లో లగేజ్ మాయం..ఎయిర్టాగ్తో నిందితుడిని గుర్తించిన ప్రయాణికుడు