సొగసుల రంగేళీ!

రంగుల హోలీ నిస్సందేహంగా కుర్రకారు పండగే. మరి  వచ్చేవారం ఈ వేడుక మరింత కలర్‌ఫుల్‌గా, స్టైల్‌గా ఉండాలంటే ఈ సూత్రాలు పాటించండి.

Updated : 12 Mar 2022 04:39 IST

రంగుల హోలీ నిస్సందేహంగా కుర్రకారు పండగే. మరి  వచ్చేవారం ఈ వేడుక మరింత కలర్‌ఫుల్‌గా, స్టైల్‌గా ఉండాలంటే ఈ సూత్రాలు పాటించండి.

* ఫ్యాబ్రిక్‌: హోలీకి రంగులతో చెలరేగిపోతాం. ఉత్సాహంతో కేరింతలు కొడతాం. పరుగెడతాం.. దూకుతాం. ఈ హడావుడి అంతా ఇంతా కాదు. ఇవన్నీ తట్టుకోవాలంటే.. దుస్తుల ఫ్యాబ్రిక్‌కి ప్రాధాన్యం ఇవ్వాలి. కాటన్‌ రకం అయితే ఎండల్లోనూ ఒంటికి చల్లగా, హాయిగా ఉంటాయి. పొద్దంతా రంగులు, నీటితో ఆడుతుంటే ఒంటిపై నీటిని నిలవనీయని నైలాన్‌ వేసుకుంటే ఉత్తమం. సింథటిక్‌ దుస్తుల జోలికి వెళ్లొద్దు. రోజంతా అసౌకర్యంగా ఉంటాయి.

* పాదరక్షలు: ఈ సమయంలో మన యూత్‌కి పాదాలు భూమ్మీద ఆగవు. అందుకే అటూఇటూ కదలడానికి సౌకర్యంగా ఉన్నవే ఎంచుకోవాలి. ఫ్లిప్‌ఫ్లాప్స్‌.. మేలు. షూలు, హీల్స్‌ ఎబ్బెట్టుగా, అసౌకర్యంగా ఉంటాయి.

* యాక్సెసరీలు: హోలీ అంటే ఫ్యాషన్‌ షో కాదు.. ఒంటిపై వస్తువులు ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. కొంచెం స్టైలిష్‌గా కనబడాలి అంటే.. సింపుల్‌గా సన్‌గ్లాసెస్‌ ధరిస్తే చాలు. స్కార్ఫ్‌లు, ఆభరణాలు అసలే వద్దు.

* ఏ రకం?: రంగుల్లో కొన్ని రసాయనాలూ ఉంటాయి. అందుకే వేడుక వేళ మొత్తం ఒంటిని కప్పే ఔట్‌ఫిట్‌ అయితేనే మంచిది. డెనిమ్‌ జీన్స్‌, ప్లెయిన్‌ టాంక్‌ టాప్స్‌, లాల్చీ పైజామా అయితే సంప్రదాయ వేడుకని మరిపిస్తాయి. ఈ సమయంలో పార్టీవేర్‌, ఆధునికమైన డ్రెస్‌లు అసలే వద్దు. తెలుపు, లేత వర్ణం దుస్తులైతే అనువుగా ఉంటాయి. ముదురు రంగులు పండగ కళని తగ్గిస్తాయి.

 షణ్మిత గాయత్రి, ఫ్యాషన్‌ డిజైనర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని