తల తిప్పితే శబ్దం

సాదాసీదాగా కాదు.. సరికొత్తగా ఉంటేనే, యూత్‌ కొత్త గ్యాడ్జెట్స్‌ వైపు చూస్తుంటారు. ఆ కిటుకు కనిపెట్టిన ‘ఆరెంజ్‌ యాంప్లికేషన్‌’ సంస్థ ‘ఓ బోన్స్‌’ అనే వైర్‌లెస్‌ హెడ్‌ఫోన్స్‌ని

Updated : 26 Mar 2022 05:15 IST

సాదాసీదాగా కాదు.. సరికొత్తగా ఉంటేనే, యూత్‌ కొత్త గ్యాడ్జెట్స్‌ వైపు చూస్తుంటారు. ఆ కిటుకు కనిపెట్టిన ‘ఆరెంజ్‌ యాంప్లికేషన్‌’ సంస్థ ‘ఓ బోన్స్‌’ అనే వైర్‌లెస్‌ హెడ్‌ఫోన్స్‌ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ‘బోన్‌ కండక్షన్‌ టెక్నాలజీ’ ద్వారా పని చేయడం ఈ హెడ్‌ఫోన్‌ ప్రత్యేకత. వీటిని చెవుల్లో అమర్చుకొని.. తలను అటుఇటు ఆడించడం, నొసలు చిట్లించడం ద్వారా.. సౌండ్‌ పెంచడం, తగ్గించడం చేయొచ్చు. ఫ్రీక్వెన్సీ మార్చుకోవచ్చు. ఈ హెడ్‌ఫోన్స్‌లో అత్యంత మృదువైన కుషన్స్‌ అమర్చారు. ధర రూ.6,666. ఆరెంజ్‌ యాంప్లికేషన్స్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి కొనుగోలు చేయొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని