ఎండల్లో హాయ్‌ హాయ్‌..

వేసవి తరుముకొచ్చేసింది.. కుర్రాళ్లు సొగసుల్ని పరుగులు పెట్టించాల్సిన తరుణం వచ్చేసింది. ఒంటికి సౌకర్యంగా ఉండే దుస్తులు వేస్తూనే.. స్టైల్‌లో రాజీ పడకుండా చెలరేగిపోవడానికి ఇవిగోండి చిట్కాలు.

Published : 02 Apr 2022 02:16 IST

వేసవి తరుముకొచ్చేసింది.. కుర్రాళ్లు సొగసుల్ని పరుగులు పెట్టించాల్సిన తరుణం వచ్చేసింది. ఒంటికి సౌకర్యంగా ఉండే దుస్తులు వేస్తూనే.. స్టైల్‌లో రాజీ పడకుండా చెలరేగిపోవడానికి ఇవిగోండి చిట్కాలు.

పోలోలు మేలు: ఫార్మల్‌గా కనిపించాలి, చొక్కాలకు ప్రత్యామ్నాయం కావాలి.. అనుకుంటే పోలో టీషర్టులు వేయండి. జీన్స్‌, చినోస్‌, ట్రౌజర్లు.. వేటికైనా జతగా సరిపోతాయి. పార్టీవేర్‌ కోసం జీన్స్‌తో కలిపి వేయండి. కార్యాలయాలకైతే చినోస్‌ లేదా ట్రౌజర్లు జత చేయండి.

షార్ట్స్‌: వేసవిలో వార్డ్‌రోబ్‌లలో తప్పకుండా ఉండాల్సినవి. సౌకర్యం, స్టైల్‌ వీటి సొంతం. టీషర్టులతో కలిపి వేస్తే బాగుంటాయి. కాకపోతే ఇంట్లో, రోజువారీ వాడకానికే నప్పుతాయి. నేవీ బ్లూ, గ్రే, బ్లాక్‌, మెరూన్‌ రంగులు ఎవరికైనా నప్పుతాయి.

జీన్స్‌: ఒంటికి వేడిని తగ్గించాలంటే.. ముదురు, వాష్డ్‌ జీన్స్‌ కన్నా తేలికైనవి ధరించాలి. వేసవిలో తప్పకుండా దూరం పెట్టాల్సింది యాసిడ్‌ వాష్డ్‌ జీన్స్‌. సొగసుగా, సౌకర్యంగా ఉండాలనుకుంటే కుర్రాళ్లు చిరుగుల జీన్స్‌ ప్రయత్నించవచ్చు.

పాదరక్షలు, షూలు: ఎండాకాలంలో దుస్తుల  ఎంపికతోపాటు సరైన బాటమ్‌వేర్‌ ఎంచుకుంటేనే అలంకరణ పూర్తైనట్టు. ఈ సమయంలో సౌకర్యంగా ఉండేవి స్నీకర్లు, లోఫర్లే. తేలికగా ధరించవచ్చు. కాళ్లకి గాలి అందుతుంది. ఫార్మల్‌, సెమీ ఫార్మల్‌ దుస్తులకు సైతం సరిపోతాయి.

డిజైన్లు, రంగులు: ఈ వేసవిలో కంటికింపుగా, చూడటానికి అందంగా కనిపించాలంటే ప్యాటర్న్‌లు, చెక్స్‌, చిన్న గళ్లు, టై అండ్‌ డై.. డిజైన్లు ఎంచుకోవచ్చు. లేత రంగులైతే వేడి దరి చేరకుండా కాపాడతాయి.

- షణ్మిత గాయత్రి, ఫ్యాషన్‌ డిజైనర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని