కెవ్వు.. కేన్స్‌ బేబీస్‌!

రోమ్‌లో ఉంటే రోమన్‌లా ఉండాలంటారు! మరి ఫ్యాషన్ల కేంద్రమైన ‘కేన్స్‌ ఫిల్మ్‌ఫెస్టివల్‌’కి వెళ్లిన భామలు సొగసులతో చెలరేగిపోకుండా ఉంటారా? ఈ వేడుకలో రెడ్‌కార్పెట్‌పై నడిచే అవకాశం రావడమే పెద్ద విజయం. అందుకే ఈ మూడురోజుల వేడుకలో దీపికా పదుకొణె, తమన్నా, పూజా హెగ్డేలు.. హొయలతో అందర్నీ తమవైపు తిప్పుకున్నారు. ఫొటోలతో అంతర్జాలంలో కల్లోలం రేపారు.

Published : 21 May 2022 00:54 IST

రోమ్‌లో ఉంటే రోమన్‌లా ఉండాలంటారు! మరి ఫ్యాషన్ల కేంద్రమైన ‘కేన్స్‌ ఫిల్మ్‌ఫెస్టివల్‌’కి వెళ్లిన భామలు సొగసులతో చెలరేగిపోకుండా ఉంటారా? ఈ వేడుకలో రెడ్‌కార్పెట్‌పై నడిచే అవకాశం రావడమే పెద్ద విజయం. అందుకే ఈ మూడురోజుల వేడుకలో దీపికా పదుకొణె, తమన్నా, పూజా హెగ్డేలు.. హొయలతో అందర్నీ తమవైపు తిప్పుకున్నారు. ఫొటోలతో అంతర్జాలంలో కల్లోలం రేపారు.

సంప్రదాయ సింగారం దీపికా: ఈ వేడుకలో దీపిక కోసం ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ సబ్యసాచి ముఖర్జీ ప్రత్యేకంగా దుస్తులు రూపొందించాడు. ఆరు గజాల నలుపు, బంగారు వర్ణం చీర.. స్ట్రాప్‌లెస్‌ రవికెలో ముస్తాబై రెండోరోజు రెడ్‌కార్పెట్‌ మీద హొయలు పోయింది దీపిక. అన్నట్టు తను న్యాయనిర్ణేతల బృందంలో సభ్యురాలు కూడా. అందుకే భారతీయ సంస్కృతి, వారసత్వ సంపద ఉట్టిపడేలా.. చీర ధరించింది. దానికి కొంచెం ఆధునికత అద్ది మరింత వన్నెలు తీసుకొచ్చింది. 

ఆధునిక సొగసు తమన్నా: మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఈ వేడుకకి హాజరవడం ఇదే మొదటిసారి. మొదటిరోజు చిలకాకు పచ్చ డ్రెస్‌లో సందడి చేసింది. రెండోరోజు నలుపు, తెలుపుల పొడవాటి ‘బబుల్‌ హెమ్‌ గౌను’ ధరించి ఎర్ర తివాచీపై నడిచింది. దీనికి జతగా పొడవాటి వజ్రాల చెవిరింగులు, మెడచుట్టూ జైపుర్‌ జెమ్స్‌ ధరించి ఫొటోగ్రాఫర్లను తనచుట్టూ తిప్పుకుంది. ఈ దుస్తుల్ని డిజైనర్ల ద్వయం గౌరి, నైనికలు రూపొందించారు.  

ఆకట్టుకున్న బుట్టబొమ్మ: మన పూజాహెగ్డే కేన్స్‌లో తళుక్కుమనడం ఇదే తొలిసారి. నలుపు స్కర్టు మీద తెలుపు చొక్కా వేసి మొదటిరోజు సింపుల్‌గా ఉన్న బుట్టుబొమ్మ రెండు, మూడో రోజుల్లో సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. రెడ్‌కార్పెట్‌పై నడిచేటప్పుడు నెక్‌లైన్‌ డిజైన్‌ స్ట్రాప్‌లెస్‌ గులాబీ రంగు గౌనుతో ఆకట్టుకుంది. అంతకుముందు నలుపు రంగు చారలతో ఉన్న పసుపు రంగు పొట్టి స్కర్టుతో అందర్నీ ఆకర్షించింది. ఈ ఔట్స్‌ఫిట్స్‌ని ప్రఖ్యాత డిజైనర్‌ రాబర్టో క్యావల్లీ రూపొందించారు. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని