‘మేడమ్‌’ అయ్యింది..‘ప్రాణం’

ఏడేళ్ల కిందట నయనతార-విఘ్నేష్‌ల మధ్య ‘క్లాప్‌’ కొట్టిన ప్రేమ ‘లాంగ్‌ షెడ్యూల్‌’ ముగించి, పెళ్లితో ఒక్కటైంది. ‘సస్పెన్స్‌ థ్రిల్లర్‌’లా ఊహించని మలుపులతో పెళ్లి పీటలదాకా వచ్చిన ఈ ప్రేమ పెళ్లిలో ‘స్పెషల్‌ ఎఫెక్ట్స్‌’లా ఎన్నో ప్రత్యేతలున్నాయి. ప్రేమ ముచ్చట్లు పాతబడ్డాయి గనక..

Updated : 11 Jun 2022 02:30 IST

ఏడేళ్ల కిందట నయనతార-విఘ్నేష్‌ల మధ్య ‘క్లాప్‌’ కొట్టిన ప్రేమ ‘లాంగ్‌ షెడ్యూల్‌’ ముగించి, పెళ్లితో ఒక్కటైంది. ‘సస్పెన్స్‌ థ్రిల్లర్‌’లా ఊహించని మలుపులతో పెళ్లి పీటలదాకా వచ్చిన ఈ ప్రేమ పెళ్లిలో ‘స్పెషల్‌ ఎఫెక్ట్స్‌’లా ఎన్నో ప్రత్యేతలున్నాయి. ప్రేమ ముచ్చట్లు పాతబడ్డాయి గనక.. కొత్తగా ముస్తాబైన నయన్‌ కొత్త పెళ్లికూతురి సొగసు సంగతులే చెప్పుకుందాం మరి.

* చిత్రవర్గాల సమాచారం ప్రకారం నయన్‌ తన ప్రియుడు, భర్త విఘ్నేష్‌కి చెన్నైలో ఒక బంగ్లాని కానుకగా ఇచ్చింది. దీని విలువ అక్షరాలా రూ.20 కోట్లపైనే ఉంటుందని సమాచారం.

* పెళ్లిలో పుత్తడిబొమ్మలా నయన్‌ ధరించిన నగలన్నీ విఘ్నేష్‌ ప్రేమతో బహుకరించినవే. ఇందులో తను చేతి వేలికి ధరించిన ఒక్క వజ్రపుటుంగరం విలువే రూ.5 కోట్లు ఉంటుందట.

* గులాబీ ఎరుపు రంగు చీర కట్టి పెళ్లిలో మెరిసిపోయింది నయన్‌. దీన్ని ప్రముఖ డిజైనర్ల ద్వయం మోనికా-కరిష్మాలు రూపొందించారు.

రవికెపై లక్ష్మీదేవి ప్రతిమలతో కూడిన మోతిఫ్‌లు పేర్చారు. చేతుల అంచుల్లో జంట పేర్లు వచ్చేలా డిజైన్‌ చేశారు.

* నగల్ని ప్రముఖ డైమండ్‌ హౌజ్‌ ‘గోయెంఖా ఇండియా’ నుంచి తెప్పించారు. జాంబియన్‌ ఎమరాల్డ్‌ మెడహారం, రష్యన్‌ టంబుల్‌ నెక్లెస్‌.. పచ్చలు, వైఢూర్యాల చెవి రింగులతో మెరిసిపోయింది.

* ‘నయన్‌ మేడమ్‌ నుంచి.. నా బంగారం నుంచి.. నా బేబీ నుంచి.. నా జీవితం నుంచి.. నా కంటిపాప నుంచి.. చివరికి నా అర్ధాంగి వరకు’ అంటూ విఘ్నేష్‌ మూడు ముక్కల్లో తమ ప్రేమ కథను అందంగా ట్వీట్‌ చేశాడు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని