కావద్దు.. మరీ ‘స్మార్ట్’
అఖిల.. బీటెక్ మూడో ఏడాది. అందరిలాగే తనదీ స్మార్ట్‌ఫోనే. వాడే ల్యాప్‌టాప్ స్మార్టే. మూణ్నెల్ల కిందట పుట్టినరోజుకి నాన్న స్మార్ట్ వాచీ కొనిచ్చారు. అప్పట్నుంచే మొదలయ్యాయి కొత్త కష్టాలు. బ్రేక్‌ఫాస్ట్ చేసినా, డిన్నర్‌కి కూర్చున్నా ఆ వాచీలో తూకం వేయడమే! కేలరీల లెక్కలు తీయడమే! ఎక్కువ తింటే లావవుతాననే భయం. ఎప్పుడైనా గుండె కాస్త వేగంగా కొట్టుకున్నట్టు అనిపిస్తే వణుకు. వెంటనే ఈసీజీ తీసేస్తుంటుంది. కరోనా ముప్పు పోలేదంటూ మాటిమాటికీ ఆక్సిజన్ స్థాయిలు పరీక్షించుకుంటుంది. గ్యాడ్జెట్ నుంచి ఏ నోటిఫికేషన్ వచ్చినా బాడీలో ఏదో తేడా ఉందోననే ఆందోళన. మొత్తానికి చలాకీ పిల్ల కాస్తా చతికిలపడిపోయింది. ఆరోగ్య సమాచారం అందిస్తుందనుకున్న యంత్రం కాస్తా ఆమె పాలిట విలన్‌లా మారింది. ఇలాంటి అఖిలలు ఇప్పుడు కోకొల్లలు. ఈ భావననే ‘స్మార్ట్‌వాచ్ యాంగ్జైటీ’, ‘డిజిటల్ యాంగ్జైటీ’ అంటున్నారంతా. దీని బారిన పడుతోంది.. ఎక్కువ యువతే.
టెక్నాలజీ జోరు పెరుగుతున్నకొద్దీ కొత్త గ్యాడ్జెట్లు మార్కెట్‌ని ముంచెత్తడం మామూలే. అలా ఈ మధ్యకాలంలో కుర్రకారుని బాగా ఆకట్టుకుంటున్నవి స్మార్ట్ వాచీలు, ఫిట్‌నెస్ ట్రాకర్లు. పాటలు వినడం, సందేశాలు పంపుకోవడం, కరిగిన కెలోరీల లెక్కలేసుకోవడం, గుండె లయని గమనించడం, నాడి పట్టడం, బీపీ చూసుకోవడం, రక్తంలో ఆక్సిజన్ పాళ్లు తెలుసుకోవడం... ఒకటేమిటి.. మణికట్టులో ఒదిగే ఈ స్మార్ట్ యంత్రాల ఫీచర్లు తక్కువేం కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది మన చెంతనుంటే ఓ వైద్యుడు వెంట ఉన్నట్టే. అంతవరకు బాగానే ఉందిగానీ ఈ ఆరోగ్య స్పృహ అధికమైతేనే వస్తుంది చిక్కంతా. పక్క దిగింది మొదలు.. బీపీలు చెక్ చేసుకోవడాలు.. హైరానా పడిపోవడం.. అస్తమానమూ నోటిఫికేషన్ల ధ్యాస.. ఈ డోసు పెరిగితేనే తిప్పలు. ఆరాటం, ఆతృత కాస్తా ఆందోళనగా మారుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అమెరికాలోని ... ఓ అమ్మాయి ఇలాగే లేనిపోని అనుమానాలతో తన యాపిల్ స్మార్ట్‌వాచీతో ఏడాదిలోనే 916 సార్లు ఈసీజీలు తీయించుకుందట. చివరికి వీళ్ల పరిస్థితి ఎలా తయారవుతుందంటే.. తనకు ఏదో అనారోగ్య సమస్య ఉందని తేలితే తప్ప ఈ ఆందోళన తగ్గదట. ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్లు ఈ ‘వియరేబుల్ గ్యాడ్జెట్స్’ జోలికి వెళ్లకపోవడమే మంచిదంటున్నారు మానసిక నిపుణులు. కనీసం వాడకాన్ని తగ్గించడం లేదా నోటిఫికేషన్లు ఆఫ్‌లో పెట్టమని సలహా ఇస్తున్నారు.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Monkeypox: మంకీపాక్స్ టీకా తయారీకి ఎనిమిది ఫార్మా సంస్థల ఆసక్తి!
-
Movies News
RRR: ఆర్ఆర్ఆర్ టీమ్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన గూగుల్.. ఏం చేసిందంటే?
-
General News
Andhra News: ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ.. ప్రాజెక్టులకు భారీగా వరద
-
Sports News
PV Sindhu : వరల్డ్ ఛాంపియన్‌షిప్‌నకు పీవీ సింధు దూరం
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Komatireddy venkatreddy: కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి కాక.. అసలు ఆయన మనసులో ఏముంది?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Karthikeya 2 Review: రివ్యూ: కార్తికేయ-2
- Naga Chaitanya: సినిమా మధ్యలోనే ప్రేక్షకులు బయటకు వచ్చేశారు.. బాధేసింది: నాగచైతన్య
- F3: ‘ఎఫ్-3’.. వెంకీ ఎలా ఒప్పుకొన్నాడో ఏంటో: పరుచూరి గోపాలకృష్ణ
- Rishi Sunak: ఆయన నా ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదు: రిషి సునాక్
- Offbeat: ఆ విమానంలో జర్నీ కేవలం ఒక్క నిమిషమే.. ధరెంతో తెలుసా..?
- Salman Rushdie: కన్ను కోల్పోవచ్చు.. చేతుల్లో నరాలు తెగిపోయాయి..!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (13/08/2022)
- kareena kapoor: వాళ్లే మా సినిమాను ట్రోల్ చేశారు..అందుకే ఇలా! కరీనా కపూర్
- Best catches: విండీస్ ఆటగాళ్ల మెరుపు ఫీల్డింగ్.. ఒకే మ్యాచ్‌లో మూడు సంచలన క్యాచ్‌లు!
- SCR: చుట్టూ చూడొచ్చు.. చుక్కలూ లెక్కెట్టొచ్చు.. ద.మ.రైల్వేలో తొలి రైలు