హ్యాండ్‌స్టాండ్..జోరందుకున్న ట్రెండ్
తారలు మొదలెడితే ట్రెండ్ మొదలవుతుందా? మొదలైన ట్రెండ్‌నే వాళ్లు అనుసరిస్తారా? దీనికి సమాధానం చెప్పడం కష్టమే! కానీ వీళ్లు అందిపుచ్చుకున్నాకే.. ఆ ట్రెండ్ జోరందుకుంటుందన్నది వాస్తవం. తారల్ని చూశాకే గల్లీల్లో పోరగాళ్లు పోలోమంటూ ఫాలో అవుతారు. సొగసుల చిత్రాంగులు అచ్చంగా వాళ్లనే దించేస్తారు
తారలు మొదలెడితే ట్రెండ్ మొదలవుతుందా? మొదలైన ట్రెండ్‌నే వాళ్లు అనుసరిస్తారా? దీనికి సమాధానం చెప్పడం కష్టమే! కానీ వీళ్లు అందిపుచ్చుకున్నాకే.. ఆ ట్రెండ్ జోరందుకుంటుందన్నది వాస్తవం. తారల్ని చూశాకే గల్లీల్లో పోరగాళ్లు పోలోమంటూ ఫాలో అవుతారు. సొగసుల చిత్రాంగులు అచ్చంగా వాళ్లనే దించేస్తారు. ‘హ్యాండ్‌స్టాండ్’ ఫిట్‌నెస్ ట్రెండ్ ఇప్పుడు వీళ్ల పుణ్యానే సామాజిక మాధ్యమాన్ని సునామీలా ముంచెత్తోంది. వర్కవుట్ వేయడం ఇన్‌స్టాలో పోస్ట్ చేయడం ఓ రివాజుగా మారింది. పైగా కథానాయికలు పొట్టి నిక్కర్లు, బిగుతైన దుస్తులు వేసుకొని ఈ ట్రెండ్‌కి సొగసుదనమూ జోడిస్తున్నారు.
బాలీవుడ్ ముదురు అమ్మడు మలైకా అరోరా నుంచి టాలీవుడ్ లేత భామ అనన్య నాగళ్ల దాకా.. ఈ ఫిట్‌నెస్ సవాల్‌ని స్వీకరించి సామాజిక మాధ్యమాల్లోని తమ వాల్‌ని ముంచెత్తుతున్నారు. లావణ్య త్రిపాఠి, శ్రుతీ హాసన్, ఫాతిమా సనా షేక్, సన్ని లియోన్, షామా సికందర్, ఆకాంక్ష రంజన్ కపూర్, రశ్మీ శెట్టిలాంటి వాళ్లూ తలో చెయ్యి వేయడంతో ఈ ఫన్ ఛాలెంజ్ ఈతరం అమ్మాయిలు, అబ్బాయిల్ని వేగంగా ఆకట్టుకుంటోంది.
చేయడమెలా?: ముందు ఒక కాలిని గోడకి ఆనించి.. వెనక్కి తిరగాలి. తర్వాత కిందికి వంగి రెండు అరచేతులను నేలకి ఆనించి ఇంకో కాలుని మొదటి కాలుకి సమాంతరంగా ఉంచడమే ఈ ట్రెండ్ స్టైల్. పది నుంచి పదిహేను సెకన్లపాటు ఉంచి యథాస్థానానికి రావాలి.
ఛాలెంజ్ సరే.. సొగసైన పోజులు బాగున్నాయి.. మరి ఈ వర్కవుట్‌తో ఒరిగేదేమైనా ఉందా? అంటే ‘ఓహ్.. లేకేం.. బ్రహ్మాండమైన ఉపయోగాలున్నాయి’ అంటున్నారు ఫిట్‌నెస్ నిపుణులు.
* ఇది శరీర పైభాగాన్ని దృఢం చేస్తుంది.
* తరచూ చేస్తుంటే శరీరం సమన్వయం, నియంత్రణలో ఉంటుంది.
* అజీర్ణ సమస్యలు తొలగుతాయి.
* ఒత్తిడి తగ్గుతుంది. కోర్ స్ట్రెంగ్త్ మెరుగుపడుతుంది.
* అంతస్రావ వ్యవస్థ మెరుగుపడుతుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Michaung Cyclone: తీవ్ర తుపానుగా మిగ్జాం.. ఈ జిల్లాల్లో తీవ్ర ప్రభావం
-
Congress: ఆత్మపరిశీలన చేసుకుంటాం.. మధ్యప్రదేశ్ ఫలితం అంతుపట్టడం లేదు!
-
Cyclone Michaung: ‘మిగ్జాం’ ప్రభావం.. తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు
-
Telangana: టీఎస్ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు రాజీనామా
-
Chennai Rains: కొట్టుకుపోయిన కార్లు.. రన్‌వేపైకి వరద.. చెన్నైలో వర్ష బీభత్స దృశ్యాలు
-
Nani: మణిరత్నం సినిమాలు చూసి చాలా టెక్నిక్స్ నేర్చుకున్నా : నాని