హంటర్‌ వేట మొదలైంది

కుర్రకారు మెచ్చేలా మరో కొత్త బండి మార్కెట్లోకి వచ్చేసింది. అదే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ‘హంటర్‌ 350’. మిడ్‌ సెగ్మెంట్‌ విభాగంలో వస్తున్న ఈ బండికి చాలానే ప్రత్యేకతలున్నాయి.

Updated : 13 Aug 2022 05:35 IST

కుర్రకారు మెచ్చేలా మరో కొత్త బండి మార్కెట్లోకి వచ్చేసింది. అదే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ‘హంటర్‌ 350’. మిడ్‌ సెగ్మెంట్‌ విభాగంలో వస్తున్న ఈ బండికి చాలానే ప్రత్యేకతలున్నాయి.

ఫీచర్లు: ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది దీని బరువు. ఇది 181 కేజీలు మాత్రమే ఉంటుంది. ఈ సెగ్మెంట్‌లో మిగతా టూవీలర్లతో పోలిస్తే పది నుంచి పద్నాలుగు కేజీల బరువు తక్కువ. అలాయ్‌ చక్రాలు, ట్విన్‌ డౌన్‌ట్యూబ్‌ స్పైన్‌ ఫ్రేమ్‌ సెటప్‌, టెలిస్కోపిక్‌ ఫోర్క్స్‌, ట్యూబ్‌లెస్‌ టైర్లు, డ్యుయెల్‌ ఛానెల్‌ ఏబీఎస్‌.. ఫీచర్లలో కొన్ని. సెమీ డిజిటల్‌ స్పీడోమీటరు కన్‌సోల్‌, నీటి బిందువు ఆకారంలో ఇంధన ట్యాంకు, ఎల్‌ఈడీ టెయిల్‌ లైట్లు.. బండి స్టైలిష్‌గా కనిపించేలా చేస్తున్నాయి.

అత్యధిక వేగం: 114 కి.మీ./గం
మైలేజీ: 36.2 కి.మీ./లీ
ధర: రూ.1.50లక్షలు (ఎక్స్‌ షోరూం)


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని