సంప్రదాయ సింగారంలో సొగసు బంగారాలు!

అసలే అందగత్తెలు.. ఆపై వాళ్లు తెర మెరుపులు. కుర్రాళ్ల ఒంటినే కళ్లుగా మార్చేసేలా సొగసులతో కనువిందు చేసే భామలు. కురచ దుస్తులు వేసీవేసీ బోర్‌ కొట్టిందేమో! మోడ్రన్‌ దుస్తులను పక్కనబెట్టి ఇప్పుడు సంప్రదాయ ‘లెహంగా’లకే జై కొడుతున్నారు.

Updated : 13 Aug 2022 05:24 IST

సలే అందగత్తెలు.. ఆపై వాళ్లు తెర మెరుపులు. కుర్రాళ్ల ఒంటినే కళ్లుగా మార్చేసేలా సొగసులతో కనువిందు చేసే భామలు. కురచ దుస్తులు వేసీవేసీ బోర్‌ కొట్టిందేమో! మోడ్రన్‌ దుస్తులను పక్కనబెట్టి ఇప్పుడు సంప్రదాయ ‘లెహంగా’లకే జై కొడుతున్నారు. సినిమా ప్రచార కార్యక్రమం, ప్రైవేటు పార్టీ, మాల్స్‌ ఓపెనింగ్‌.. సందర్భం ఏదైనా తరచూ లెహెంగాలు వారి ఒంటిని చుట్టేస్తున్నాయి. కాస్త ఖరీదు ఎక్కువైనా.. ధరిస్తే అందం రెట్టింపవడం, రిచ్‌ లుక్‌తో కనిపించడం, ఫ్యాషన్‌ ప్రయోగాలు చేసే వెసులుబాటు ఉండటంతో వీటికి ఓటేస్తున్నారు. పొట్టి, పొడవు, లావు, సన్నం.. అమ్మాయి ఎలా ఉన్నా ఇవి ఒంటికి నప్పుతాయి. ముఖ్యంగా వీటిని ధరిస్తే సౌకర్యంగా ఉంటాయి. అందుకే టాలీవుడ్‌ తారలు రష్మిక మందన్న, మృణాల్‌ ఠాకూర్‌, రాశీ ఖన్నా ఆమధ్య సమంత, కృతి శెట్టి ఈ తరహా దుస్తులతో కనువిందు చేశారు. తమకిష్టమైన తారలు ఓ ట్రెండ్‌ని సెట్‌ చేస్తే అభిమానించే అమ్మాయిలు వారిని ఫాలో అవకుండా ఉంటారా? వాళ్లూ పోలోమంటూ లెహెంగాల బాట పడుతున్నారు. రానున్నది పండగలు, పెళ్లిళ్ల సీజన్‌. ఈ సంప్రదాయ సింగారంలో సొగసు బంగారాలు మరింత మెరిసిపోవడం ఖాయమంటున్నారు ఫ్యాషన్‌ గురూలు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని