Published : 27 Aug 2022 01:16 IST

ఇది జింగమ్‌ స్టైల్‌..

మనుషులకు ఎక్స్‌పైరీ ఉంటుందేమోగానీ ఫ్యాషన్లు ఎవర్‌గ్రీన్‌. అటూఇటూ తిరిగి ఆధునిక కుర్రకారు ఒంటిని చుట్టేస్తూనే ఉంటాయి. ఇప్పుడు ‘జింగమ్‌ ప్రింట్స్‌’ వంతు వచ్చింది. ప్రిన్సెస్‌ డయానా కాలంలో ఫేమస్‌ అయిన ఈ స్టైల్‌ మళ్లీ ‘లైగర్‌’ భామ అనన్య పాండే ఒంటిపైకి చేరింది. ప్రియాంకాచోప్రా నుంచి మన బుల్లితెర నటి పిల్లి దీపికా దాకా అంతా ఈ ఫ్యాబ్రిక్‌కి ఫిదా అవుతున్నారు. హనీమూన్‌ టూర్‌లో కత్రినా కైఫ్‌, ప్రైవేటు కార్యక్రమంలో మీరా రాజ్‌పూత్‌ ఈ ఫ్యాషన్‌తోనే మెరిసిపోయారు. తారలకు ప్రియనేస్తమై చివరికి కాలేజీ క్యాంపస్‌లు చేరింది. కుర్రాళ్లూ ఈ స్టైల్‌కి ప్రియనేస్తాలవుతున్నారు. ఫ్యాషన్‌ షోల నుంచి మొదలుకొని పక్క గల్లీ మాల్స్‌ దాకా ఎక్కడ చూసినా ఇవే దర్శనమిస్తున్నాయి. తలకు పెట్టుకునే టోపీ నుంచి కాలి బూట్ల దాకా ఈ డిజైన్స్‌ని ఇష్టపడుతున్నారు. ఫ్యాబ్రిక్‌ విషయానికొస్తే ఇది తేలికగా ఉండే కాటన్‌ ఔట్‌ఫిట్‌. తెలుపు, నలుపు, బోల్డ్‌ రంగుల్లో లభ్యమవుతుంది. ఎలాంటి శరీరాకృతి ఉన్నవారికైనా నప్పుతుంది. ఆధునికంగా కనిపించాలనుకునే వారికి మంచి ఎంపిక. అందుకే.. ఈమధ్యకాలంలో ఈ స్టైల్‌ ఇన్‌స్టంట్‌ హిట్‌ కొడుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts