వ్యాగ్స్‌.. వావ్‌

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ మొదలైంది. ఆట జోరు మీదున్నా.. అందమైన అభిమానులు, ఆకట్టుకునే ఫ్యాషన్ల సందడి కొంత తగ్గినట్టే కనిపిస్తోంది. ఈసారి ఖతర్‌లో కప్‌ జరుగు తుండటంతో కథే మారిపోయింది.

Published : 26 Nov 2022 01:14 IST

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ మొదలైంది. ఆట జోరు మీదున్నా.. అందమైన అభిమానులు, ఆకట్టుకునే ఫ్యాషన్ల సందడి కొంత తగ్గినట్టే కనిపిస్తోంది. ఈసారి ఖతర్‌లో కప్‌ జరుగు తుండటంతో కథే మారిపోయింది. కురచ దుస్తులు వేయొద్దు.. హద్దులు మీరొద్దు.. అంటూ ఆ దేశం ఆంక్షలు విధించడంతో చిందులు వేయాలనుకున్న అభిమానులతోపాటు కెమెరాల్ని తమపై పడాలనుకున్న ఆటగాళ్ల వ్యాగ్స్‌ (వైఫ్స్‌ అండ్‌ గాళ్‌ఫ్రెండ్స్‌)కి పెద్ద చిక్కొచ్చిపడింది. అయినా ఈ అడ్డంకులు చూసి ఇంగ్లాండ్‌ వ్యాగ్స్‌ ఏమాత్రం నిరుత్సాహ పడలేదు. అసలే నాలుగేళ్లకోసారి వచ్చే కప్‌ కదా.. ఎలాగైనా తమ సొగసులతో సందడి చేయాలి అనుకున్నారు. ఈ వరల్డ్‌ కప్‌ కోసమే ప్రత్యేకంగా పర్సనల్‌ స్టైలిస్ట్‌ను నియ మించుకున్నారు. హద్దుల్లో ఉంటూనే సొగసులతో ఆకట్టుకునేలా ఔట్‌ఫిట్‌లు డిజైన్‌ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. జట్టులోని కీలక ఆటగాళ్లు ల్యూక్‌ షా, మార్కస్‌ రాష్‌ఫోర్డ్‌, జాన్‌ స్టోన్స్‌ భాగస్వాములు అనౌస్కా సాంటోస్‌, లూసియా, లివ్‌ నేలర్‌లు ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ కానీ జోన్స్‌ని ఈ ప్రపంచకప్‌ కోసమే ప్రత్యేకంగా నియమించుకున్నారు. చూడాలి.. వాళ్లు అందంతో ఎలా ఆకట్టుకుంటారో.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని