మరింత కొత్తగా..

యువత పల్స్‌ పట్టిన ద్విచక్రవాహనాల్లో బజాజ్‌ పల్సర్‌ ముందుంటుంది. సూపర్‌హిట్‌ అయిన ఈ బండికి ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేస్తూ కుర్రకారు ప్రియసఖిగా మార్చేసింది బజాజ్‌ కంపెనీ. తాజాగా అప్‌డేటెడ్‌ వెర్షన్‌తో కొత్త పల్సర్‌ పీ150ని విపణిలోకి తీసుకొచ్చింది

Updated : 24 Mar 2023 15:41 IST

యువత పల్స్‌ పట్టిన ద్విచక్రవాహనాల్లో బజాజ్‌ పల్సర్‌ ముందుంటుంది. సూపర్‌హిట్‌ అయిన ఈ బండికి ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేస్తూ కుర్రకారు ప్రియసఖిగా మార్చేసింది బజాజ్‌ కంపెనీ. తాజాగా అప్‌డేటెడ్‌ వెర్షన్‌తో కొత్త పల్సర్‌ పీ150ని విపణిలోకి తీసుకొచ్చింది. ఇందులో గమనించదగ్గ అంశాలేంటంటే..
* ఇంజిన్‌ టార్క్‌ పెంచడంతో నగరాల్లోని ట్రాఫిక్‌లోనూ తొందరగా పికప్‌ అందుకునేలా, కుదుపుల్లేకుండా బండి సాఫీగా సాగిపోతుంది.
* డ్రమ్‌ బ్రేక్‌లతో కూడిన కొత్త టెలిస్కోపిక్‌ సస్పెన్షన్‌తో బ్రేకులు మరింత సమర్థంగా పని చేస్తాయి.
* బై ఫంక్షనల్‌ ఎల్‌ఈడీ ప్రొజెక్టర్‌ హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్‌ లైట్లు, హ్యాండిల్‌బార్‌ క్లిప్‌లు, యూఎస్‌బీ ఛార్జర్‌, సింగిల్‌ ఛానెల్‌ యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌.. కొత్త ఫీచర్లు.
* రేసింగ్‌ రెడ్‌, కరేబియన్‌ బ్లూ, ఎబోనీ బ్లాక్‌ రెడ్‌, ఎబోనీ బ్లాక్‌ బ్లూ, ఎబోనీ బ్లాక్‌ వైట్‌.. అనే ఐదు కొత్త రంగుల్లో వస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని