విలాసాల విద్యుత్తు బండి

బైక్‌ లేదా కారు, చిన్న కంపెనీ లేదా పెద్ద కంపెనీ.. ఏదైనా బరిలో ఉండాలంటే ప్రతి ఆటోమొబైల్‌ కంపెనీ బ్యాటరీ బాట పట్టాల్సిందే. యువతని మెప్పించాల్సిందే.

Updated : 17 Dec 2022 01:05 IST

బైక్‌ లేదా కారు, చిన్న కంపెనీ లేదా పెద్ద కంపెనీ.. ఏదైనా బరిలో ఉండాలంటే ప్రతి ఆటోమొబైల్‌ కంపెనీ బ్యాటరీ బాట పట్టాల్సిందే. యువతని మెప్పించాల్సిందే. విలాస వాహనాల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మోటారాడ్‌ సైతం అదే మిషన్‌లో ఉంది. ఓ కొత్త స్కూటర్‌ తీసుకొస్తోంది. ఆ వివరాలు...

* సీఈ04 పేరుతో విపణిలోకి తీసుకొస్తున్న ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ టీజర్‌ని ఈమధ్యే విడుదల చేసింది బీఎండబ్ల్యూ. దీని ధర రూ.9.71లక్షలు

* ఇది 42 బీహెచ్‌పీ, 62 ఎన్‌ఎం సామర్థ్యంతో పరుగులు తీస్తుంది. రెండున్నర సెకన్లలోనే 50 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. అత్యధిక వేగం గంటకి 120 కిలోమీటర్లు.

* బ్యాటరీ పూర్తిగా ఛార్జ్‌ కావడానికి 4 గంటల 20 నిమిషాలు పడుతుంది. ఒక్కసారి ఛార్జింగ్‌తో 130 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు.

* 10.25 అంగుళాల హెచ్‌డీ టీఎఫ్‌టీ తెరని స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానం చేసుకోవచ్చు. ఇందులో నావిగేషన్‌ సహా అన్ని రైడింగ్‌ ఫంక్షన్లు కనిపిస్తాయి.

* భద్రతకి డిస్క్‌ బ్రేక్‌లు, యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌.. కుదుపుల్లేని ప్రయాణానికి టెలిస్కోపిక్‌ ఫోర్క్‌ సస్పెన్షన్‌.. చెప్పుకోదగ్గ కొన్ని ఫీచర్లు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని