జుత్తుతో.. కత్తిలా!

కుర్రాళ్ల సొగసుని రెట్టింపు చేయడంలో హెయిర్‌స్ట్టైల్‌దీ కీ రోలే. అందుకే క్రాఫ్‌తో ప్రయోగాలు చేసి కత్తిలా కనిపించేవాళ్లు చాలామందే ఉంటారు.

Published : 20 May 2023 01:11 IST

కుర్రాళ్ల సొగసుని రెట్టింపు చేయడంలో హెయిర్‌స్ట్టైల్‌దీ కీ రోలే. అందుకే క్రాఫ్‌తో ప్రయోగాలు చేసి కత్తిలా కనిపించేవాళ్లు చాలామందే ఉంటారు. అలా జుత్తుతో మెరుస్తున్న కొన్ని టాప్‌ ట్రెండ్స్‌ ఇవి. వీలైతే మీరూ ప్రయత్నించండి.  

* టేపర్‌ ఫేడ్‌: ఇది విరాట్‌ కోహ్లి ఫాలో అయ్యే స్టైల్‌. తల పైభాగంలో జుత్తు ఓ మోస్తరుగా ఉండి.. కిందికి వచ్చినకొద్దీ కురచ అవుతుంది. గెడ్డాన్ని ట్రిమ్‌ చేస్తూ.. చుబుకం భాగంలో కాస్త దట్టంగా ఉంటుంది.

* రంగులద్దండి: ఆడా, మగా తేడా లేకుండా జుత్తుకి రంగులేసే యువత ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోతున్నారు. మనవాళ్ల చర్మానికి.. పసుపు, ముదురు ఎరుపు రంగులు బాగా నప్పుతాయంటున్నారు స్టైలిస్ట్‌లు. కాలేజీ విద్యార్థులు, కొందరు కార్పొరేట్‌ ఉద్యోగులు సైతం ఈ రంగుల జుట్టుకి ఫిదా అవుతున్నారు.

* డిస్‌కనెక్టెడ్‌ అండర్‌కట్‌: వెనక, చుట్టుపక్కల పూర్తి క్లీన్‌గా ఉండి.. పైభాగంలోనే ఒత్తుగా ఉండే స్టైల్‌ ఇది. నాటు భాషలో చెప్పాలంటే ఇది డిప్ప కటింగ్‌.. కాలేజీ కుర్రాళ్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
* బజ్‌ కట్‌: జుత్తుని అందంగా.. కురచగా కత్తిరించుకోవడమే ఈ  స్టైల్‌. భారీ గడ్డం ఉన్నవాళ్లకు ఇది బాగా సూటవుతుంది. కరోనా తర్వాత కుర్రకారు ఈ స్టైల్‌ని అతిగా ఆదరిస్తున్నారు.

* క్విఫ్‌: పక్కలు, వెనక కురచగా కత్తిరించుకొని, మధ్యలో ఎక్కువ జుత్తు ఉంచుకోవడమే క్విఫ్‌  స్టైల్‌. సెలెబ్రిటీలను ఆరాధించే, ఆధునికంగా కనిపించాలనుకునే యువత దీన్ని ఎక్కువగా ఫాలో అవుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని