సంద్రంలో.. సొగసు అలలు

ఫ్యాషన్‌ షో అయినా.. కొత్త డిజైన్‌ దుస్తుల పరిచయం అయినా.. తళుకుబెళుకుల ఏ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లోనో.. అట్టహాసంగా తీర్చిదిద్దిన ఏ వేదికపైనో నిర్వహించడం ఆనవాయితీ.

Published : 01 Jun 2024 00:24 IST

ఫ్యాషన్‌ షో అయినా.. కొత్త డిజైన్‌ దుస్తుల పరిచయం అయినా.. తళుకుబెళుకుల ఏ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లోనో.. అట్టహాసంగా తీర్చిదిద్దిన ఏ వేదికపైనో నిర్వహించడం ఆనవాయితీ. మేటి ఫ్యాషన్‌ డిజైనర్ల నుంచి కొత్తవాళ్ల దాకా ఇదే పద్ధతి పాటిస్తుంటారు. పేరున్న డిజైనర్ల ద్వయం జయేష్, కాజల్‌ షాలు మాత్రం ఇందుకు భిన్నంగా షో నిర్వహించాలనుకున్నారు. తమ కొత్త ‘సముందర్‌’ కలెక్షన్లకు సముద్రాన్నే వేదికగా మలచుకోవాలనుకున్నారు. ఇంకేం.. మోడళ్లతో సహా మాల్దీవులకు బయల్దేరారు. అక్కడ సముద్ర తీరం పక్కనే.. సముద్రం అడుగున ఉండే లోకంలాంటి భారీ సెట్‌ వేయించారు. ఆల్చిప్పలు, పగడపు దిబ్బలు, చేపలు లాంటి సముద్ర జీవుల ప్రేరణతో రంగురంగుల వేదికను సృష్టించారు. వీళ్లు చేసిన డిజైన్లను ధరించి అతిథులందరి సమక్షంలో.. మోడళ్లు క్యాట్‌వాక్‌ చేశారు. అన్నట్టు ఈ సముందర్‌ కలెక్షన్లు సైతం ఎకోఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్‌తో.. పగడపు దిబ్బల స్ఫూర్తితో రూపొందించిన డిజైన్లే. ఈ సరికొత్త ప్రయత్నాన్ని ఫ్యాషన్‌ లోకం స్వాగతిస్తోంది.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు