ట్విన్‌ సెట్స్‌.. భారీ హిట్‌

సినిమా తారలు వూపు మీదుండొచ్చు. కనుమరుగైపోవచ్చు. ఫ్యాషన్ మాత్రం పదికాలాలపాటు పదిలంగానే ఉంటుంది. ఆ వరుసలో ఇప్పుడు ట్విన్ సెట్స్ వంతు వచ్చింది.

Published : 14 Jan 2016 15:02 IST

ట్విన్‌ సెట్స్‌.. భారీ హిట్‌

సినిమా తారలు వూపు మీదుండొచ్చు. కనుమరుగైపోవచ్చు. ఫ్యాషన్‌ మాత్రం పదికాలాలపాటు పదిలంగానే ఉంటుంది. ఆ వరుసలో ఇప్పుడు ‘ట్విన్‌ సెట్స్‌’ వంతు వచ్చింది. దీన్నే కోర్డినేట్‌ ప్రింట్స్‌ స్టైల్‌ అంటున్నారు. సినిమా హీరోయిన్స్‌ నుంచి వీధుల్లోచి పడుచు అమ్మాయిల దాకా ఇప్పుడు ఈ ట్రెండ్‌ హాట్‌ ఫేవరిట్‌. టాప్‌, బాటమ్‌లు పూర్తి వ్యతిరేక డిజైన్‌లో ఉండటం వీటి ప్రత్యేకత. ప్రింట్స్‌ని ఎన్నిరకాలుగా వాడినా వాటి వన్నె తగ్గదన్నది డిజైనర్ల వాదన.ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తారలు రెచ్చిపోతున్నారు. ఈ డిజైన్‌ తొలిసారి రెండేళ్ల కిందట లాక్మే ఫ్యాషన్‌వీక్‌లో తళుక్కుమంది. ప్రస్తుతం సోనమ్‌కపూర్‌, ప్రియాంకా చోప్రా, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, జరైన్‌ఖాన్‌ల నుంచి లేత పరువాల ఆలియాభట్‌, శ్రుతి హాసన్‌లకు ఇష్టమైన డిజైన్‌గా మారిపోయింది. ‘తమ మనసులోని భావాలను బయటికి వ్యక్తం చేయలేనివారు ఈ డిజైన్‌తో తమ ఉద్దేశం ఏంటో చెప్పేస్తున్నారు. ఇదో స్టైల్‌ స్టేట్‌మెంట్‌’ అంటున్నాడు డిజైనర్‌ నిఖిల్‌ మెహ్రా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని