బొమ్మల్లో ముద్దుగుమ్మలు

కార్టూన్లకు మళ్లీ మంచికాలమొచ్చింది! అంటే పత్రికల్లో వేసే బొమ్మల గురించి కాదు బాస్ మేం చెబుతోంది. ముద్దుగుమ్మల దుస్తులపై చేరుతున్న కామిక్ పాత్రల గురించి.

Published : 14 Jan 2016 15:03 IST

బొమ్మల్లో ముద్దుగుమ్మలు

కార్టూన్లకు మళ్లీ మంచికాలమొచ్చింది! అంటే పత్రికల్లో వేసే బొమ్మల గురించి కాదు బాస్‌ మేం చెబుతోంది. ముద్దుగుమ్మల దుస్తులపై చేరుతున్న కామిక్‌ పాత్రల గురించి. వివరంగా చెప్పాలంటే ‘క్విర్కీ కార్టూన్‌ ప్రింట్స్‌’ ఫ్యాషన్‌. ఔనుమరి.. వ్యక్తిగతం.. సినిమా ప్రచారం కార్యక్రమం ఏదైనా బాలీవుడ్‌ భామలు ఇప్పుడు మనసు పడుతోంది ఈ ట్రెండ్‌పైనే. ఒక్కరేంటి? జట్టు జట్టంతా ఈ సొగసులకు సలాం చెబుతున్నవారే. ప్రియాంకా చోప్రా కామిక్‌ పాత్రల కోటుతో ఎయిర్‌పోర్టులో కనువిందు చేస్తే.. సోనమ్‌కపూర్‌ మిక్కీమౌస్‌, యాంగ్రీబర్డ్‌ బొమ్మలున్న టీషర్టుకి ఒంటిపై చోటిచ్చింది. మొన్నగాక నిన్న బాలీవుడ్‌కెళ్లిన మన తమన్నా సైతం అక్కడి ట్రెండ్‌ని ఒంట పట్టించుకుంది. పెన్సిల్‌ స్కర్ట్‌ డ్రెస్‌ నిండా కార్టూన్‌ బొమ్మల డిజైన్‌తో అదరగొట్టింది. దీపికా అయితే తన మినియన్‌ ప్రింట్‌ జాకెట్‌ మీద కూడా కామిక్‌లతో కవ్వించింది. ఈషా గుప్తా, పరిణీతి చోప్రా, విద్యాబాలన్‌లు సైతం ఇదే బాటలో ఉన్నారు. ప్రముఖ డిజైనర్లు మసాబాగుప్తా, సత్యపాల్‌ సంప్రదాయ చీర డిజైన్లు రూపొందించి ముంబయి ఫ్యాషన్‌ షోలో వాటిని ప్రదర్శించినా.. వాటిపైనా కార్టూన్‌ బొమ్మల ప్రింట్లు వేసి ట్రెండ్‌ని పరుగులు పెట్టించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని