నగలు.. హొయలూ మెరిసెన్‌!

ఆస్కార్ సందడి ముగిసింది. ఆ వేడుకలో తారామణులు ఒలకబోసిన ఒయ్యారాల చర్చ ఇంకా సాగుతూనే ఉంది. చిందించిన సొగసులు ఆషామాషీవేం కాదు.

Published : 14 Jan 2016 15:07 IST

నగలు.. హొయలూ మెరిసెన్‌!

ఆస్కార్‌ సందడి ముగిసింది. ఆ వేడుకలో తారామణులు ఒలకబోసిన ఒయ్యారాల చర్చ ఇంకా సాగుతూనే ఉంది. చిందించిన సొగసులు ఆషామాషీవేం కాదు.

విశేషాల ఆ మతలబులు ఏమిటంటే...
* ఆస్ట్రేలియా ముద్దుగుమ్మ నికోల్‌ కిడ్‌మన్‌ వేసుకున్న బ్రేస్‌లెట్‌ ఖరీదెంతో తెలుసా? నలభై నాలుగు కోట్లు. 82 క్యారెట్ల కాఫ్తాన్‌ డైమండ్లు పొదిగారు మరి!

* మరో పాప రీటా ఓరా చెవి దుద్దుల విలువ వింటే ముక్కుమీద వేలు వేసుకోవాల్సిందే. అది అక్షరాలా 75 లక్షల యూఎస్‌ డాలర్లుట.

* నగలంటే ఖరీదైనవి. కేట్‌ బ్లంచెట్‌ వేసుకున్న జార్జియో ఆర్మనీ బ్రాండ్‌ గౌను అంతకన్నా విలువైంది. ధర 18.1 మిలియన్‌ డాలర్లు. మతి పోయిందా?

* ఆస్కార్‌ విజేత జూలియన్‌ మూర్‌ గౌన్‌ది మరో ప్రత్యేకత. ఈ డ్రెస్‌ కుట్టడానికి 27 మంది 987 గంటలు కష్టపడ్డారట పాపం.

* పాప్‌ దివా లేడీగాగా రెచ్చిపోయింది. తన గౌన్‌కి ఎనభైవేల సెక్విన్స్‌ వాడింది. 25 మంది 1600 గంటలు కష్టపడి కుట్టారు.

- ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కో డ్రెస్‌ది ఒక్కో ప్రత్యేకత. ఒక్కో ఔట్‌ఫిట్‌ వెనకాల ఒక్కో చరిత్ర.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని