స్కర్టు.. షర్టు కొట్టింది హిట్టు!

బాలీవుడ్ మరో సొగసుల ప్రయోగం సఫలమైంది. నింగికెగిసిన రాకెట్టులా స్కర్ట్ అండ్ షర్ట్ ఫ్యాషన్ హిట్టు కొట్టింది. షర్టేమో అచ్చమైన అబ్బాయిల ఔట్ఫిట్. అమ్మాయిల అందం....

Published : 14 Jan 2016 15:12 IST

స్కర్టు.. షర్టు కొట్టింది హిట్టు!


బాలీవుడ్‌ మరో సొగసుల ప్రయోగం సఫలమైంది. నింగికెగిసిన రాకెట్టులా ‘స్కర్ట్‌ అండ్‌ షర్ట్‌’ ఫ్యాషన్‌ హిట్టు కొట్టింది. షర్టేమో అచ్చమైన అబ్బాయిల ఔట్‌ఫిట్‌. అమ్మాయిల అందం పెంచే కానుక స్కర్ట్‌. ఈ రెండూ కలిస్తే ఫ్యాషనేంటి అంటారా? ఇది మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌ ట్రెండ్‌ గురూ! చాలా స్టైల్స్‌లాగే ఈ సొగసూ పుట్టింది విల్స్‌ ఫ్యాషన్‌ వీక్‌లోనే. డిజైనర్‌ మనీశ్‌ అరోరా చేసిన ప్రయోగాన్ని మోడల్‌ కమ్‌ హీరోయిన్లు నేహా ధూపియా, ఈషా గుప్తాలు తమ ఒంటిపై చోటిచ్చి ప్రపంచానికి పరిచయం చేశారు. ఆపై ఎప్పుడూ కొత్తకి వెల్‌కమ్‌ పలికే సోనమ్‌కపూర్‌, సారా జేన్‌ డయాజ్‌, సోనాక్షిసిన్హాలు పాపులారిటీ పెంచారు.ప్రింటెడ్‌, బంజారా, బోహో స్కర్ట్‌లపై నిండు చేతుల చొక్కాలు వేసి ఇయర్‌ రింగ్స్‌, బ్రేస్‌లెట్లు ధరిస్తే అమ్మాయిలు చాలా ఆధునికంగా, స్టైలిష్‌గా కనిపిస్తారన్నది డిజైనర్‌ నిదా మహమూద్‌ మాట. ఈ చొక్కాలు కూడా ఫార్మల్‌ ఉంటూ, నడుము కిందకి దిగకుండా ఉంటే రిచ్‌ లుక్‌ ఉంటుందన్నది మరో డిజైనర్‌ అనుపమా దయాళ్‌ సలహా. బాలీవుడ్‌లో దాదాపు అందరు తారామణులకు నచ్చేసిన ఈ ట్రెండ్‌ కాలేజీ క్యాంపస్‌లు,నగరాల్లోకి వీధుల్లోకి కూడా పాకిపోయింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని