వీపు లేపేస్తున్నారు!

అప్సరసలు.. అతిలోక సుందరీమణులు.. తెరపై మెరిసే తారామణులకు ఇలాంటి పేర్లెన్నో. అందంగా ఉంటారని.. మనసుకి కనువిందు చేస్తారని ఈ కిరీటాలు. అన్నట్టు ఈ సొగసుల ప్రదర్శన కేవలం తెరపైనే కాదండోయ్...

Published : 14 Jan 2016 15:17 IST

వీపు లేపేస్తున్నారు!


ప్సరసలు.. అతిలోక సుందరీమణులు.. తెరపై మెరిసే తారామణులకు ఇలాంటి పేర్లెన్నో. అందంగా ఉంటారని.. మనసుకి కనువిందు చేస్తారని ఈ కిరీటాలు. అన్నట్టు ఈ సొగసుల ప్రదర్శన కేవలం తెరపైనే కాదండోయ్‌.. ప్రైవేటు పార్టీలు.. అవార్డు ఫంక్షన్లల్లోనూ కాస్త ఎక్కువగానే ఉంటోంది. దీనికి బాలీవుడ్‌, టాలీవుడ్‌ అనే తేడాలేం లేవు. ఒక్కో సమయంలో, ఒక్కో సందర్భంలో యథాశక్తి హీరోయిన్లు తమ అందాలను కుమ్మరిస్తూనే ఉన్నారు. అలా ఈమధ్య కాలంలో బ్యాక్‌లెస్‌ స్టైల్‌తో దుమ్ము రేపే ట్రెండ్‌ జోరు మీదున్నట్టు కనిపిస్తోంది. సంప్రదాయ పరికిణీలపై రవికలైనా.. ఆధునిక గౌన్లు అయినా.. మోడ్రన్‌ షిమ్మర్‌లైౖనా.. స్టైల్‌ని అనువదించడం తేలిక. పైగా చూపరులు.. అభిమానులను ఆకట్టుకోవడానికిదో షార్ట్‌కట్‌. మనతో పోలిస్తే ఈ బ్యాక్‌లెస్‌ సొగసుల మేళా బాలీవుడ్‌లోనే ఎక్కువైనా ఇక్కడ బేర్‌బ్యాక్‌ బేబ్స్‌ ఉన్నారు. ముంబైలో ఆలియాభట్‌, సన్నీలియోని, దీపికా పదుకొనే.. ప్రియాంకా చోప్రా.. శ్రద్ధాకపూర్‌లాంటి ముద్దుగుమ్మలు వీపు కనిపించేలా వస్త్రధారణ చేస్తూ మెరుపులు మెరిపిస్తుంటే వాళ్లకి పోటీగా మన ఫిల్మ్‌నగర్‌ భామలూ పోటీ పడుతున్నారు. అందాల శ్రియా ఓ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమంలో బ్యాక్‌లెస్‌ స్టైల్‌తో ఆకట్టుకుంటే.. ముద్దుగుమ్మ సమంతా ఓ అవార్డుల ప్రదానోత్సవానికి బేర్‌బ్యాక్‌తో వచ్చి తనే సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. ప్రైవేటు పార్టీలో మంజరీ ఫడ్నిస్‌, దుకాణం ప్రారంభోత్సవంలో రెజీనా ఈ బాట పట్టారు. మొత్తానికి అక్కడా, ఇక్కడా అనే తేడాల్లేకుండా అందం చూడవయా.. ఆనందించవయా.. అంటూ అంతా కుర్రకారును పారవశ్యంలో ముంచెత్తుతూనే ఉన్నారు. ఈ స్టైల్‌ని పుణికిపుచ్చుకొని కాలేజీ అమ్మాయిలు వార్షికోత్సవాల్లో రెచ్చిపోతున్నారు. పక్క చిత్రాలు చూస్తే ఆ సిత్రం బోధపడుతుంది!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు