జీన్స్‌...వేయండిలా....

అతి ఫ్యాషన్ ఆ అమ్మాయి కొంప ముంచింది. బిగుతైన జీన్స్ వేసి కుర్రాళ్ల మతులు పోగొట్టాలనుకుంటే చివరికి తనే కుప్పకూలిపోయింది. స్కిన్నీ జీన్స్ వేయడంతో రక్తప్రసరణ.....

Published : 14 Jan 2016 15:24 IST

జీన్స్‌...వేయండిలా....


  అతి ఫ్యాషన్‌ ఆ అమ్మాయి కొంప ముంచింది. బిగుతైన జీన్స్‌ వేసి కుర్రాళ్ల మతులు పోగొట్టాలనుకుంటే చివరికి తనే కుప్పకూలిపోయింది. స్కిన్నీ జీన్స్‌ వేయడంతో రక్తప్రసరణ ఆగిపోయి కుప్పకూలిన ఓ ఆస్ట్రేలియా అమ్మడి కథనం ప్రపంచమంతా ఇప్పుడు హాట్‌ టాపిక్‌. అయితే ఇదేం పెద్ద సమస్యే కాదని కాసిన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలంటున్న ఫ్యాషన్‌ నిపుణుల సలహాలివి.

* లిక్రా, కాటన్‌ ఫ్యాబ్రిక్‌తో తయారైన జీన్స్‌ వేస్తే రక్త ప్రసరణ ఆగిపోవడంలాంటి శారీరక సమస్యలు ఎదురవవు
* కాటన్‌, సాటిన్‌, లిక్రా, ఏదైనా స్ట్రెచబుల్‌ (సాగే గుణం) ఉన్నవైతే సౌకర్యవంతంగా ఉంటాయి
* వేసవిలో స్కిన్నీ జీన్స్‌కి దూరంగా ఉంటేనే ఉత్తమం. ఆ కాలంలో అత్యధిక వేడిని కలగజేస్తాయి. సంతాన సాఫల్యతపై ప్రభావం చూపిస్తాయి
* రోజుకు నాలుగు గంటలు మించి బిగుతైన జీన్స్‌ ధరించొద్దని చర్మ నిపుణుల సలహా. వాడితే చర్మ సంబంధిత వ్యాధులొస్తాయంటారు
* ‘పాశ్చాత్య దేశస్థుల వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఈ డిజైన్లు మొదలయ్యాయి. వారిని గుడ్డిగా అనుసరించాల్సిన అవసరం లేద’ంటాడు డిజైనర్‌ నచికేత్‌ బారువే
* జీన్స్‌ ఎప్పుడూ పొత్తికడుపు పైభాగం వరకు ఉండాలన్నది ఆర్థోపెడిక్‌ వైద్యుల సూచన. నాభి కిందిభాగంలో కట్టడంతో క్యుటానియస్‌ (cutaneos) నరంపై తీవ్రమైన ఒత్తిడి రక్తప్రసరణపై ప్రభావం చూపిస్తాయంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని