చెంచాతో సెల్ఫీ

స్మార్ట్‌ఫోన్‌ సిన్నోళ్లకీ.. చక్కదనాల చుక్కనమ్మలకీ సెల్ఫీల గురించి చెప్పడమంటే సిల్లీగా ఉంటుంది! ఖాళీగా ఉన్నప్పుడో.. వీలు చేసుకునో ...

Published : 19 Jan 2016 11:50 IST

చెంచాతో సెల్ఫీ

 

స్మార్ట్‌ఫోన్‌ సిన్నోళ్లకీ.. చక్కదనాల చుక్కనమ్మలకీ సెల్ఫీల గురించి చెప్పడమంటే సిల్లీగా ఉంటుంది! ఖాళీగా ఉన్నప్పుడో.. వీలు చేసుకునో వాళ్లు రోజూ చేసేదదే. ఆన్‌లైన్‌ లెక్కల్లో చెప్పాలంటే పాతికేళ్లు దాటని పడుచువాళ్లు రోజూ 

సగటున ఆరు సెల్ఫీలతో మురిసిపోతున్నారట. ఈ మోజు ముదిరిన వాళ్లైతే తమ అందం కుప్పలుతెప్పలుగా కనపడాలని ‘సెల్ఫీ స్టిక్‌’లు కూడా వాడుతున్నారాయే. ఇక అసలు విషయానికొస్తే దీనికి కొనసాగింపుగా ‘సెల్ఫీ స్పూన్‌’లు కూడా వచ్చేశాయ్‌. ఇదీ సెల్ఫీ స్టిక్‌లాంటిదే. పడక దిగింది మొదలు మళ్లీ ఎక్కేదాకా ఎప్పుడైనా, ఎక్కడైనా యువతకి సెల్ఫీలు తీసుకునే అవకాశముంది. తినేటప్పుడే కాస్త విరామం. ఆ ఛాన్స్‌ కూడా ఎందుకు వదులుకోవాలి అనుకున్నారేమో దీని తయారీదారులు. అందుకే ఈ సరికొత్త గ్యాడ్జెట్‌ని మార్కెట్లోకి దించేశారు. ప్రత్యేకతల విషయానికొస్తే ఓవైపు చెంచాలా ఉంటుంది. మరోవైపు సెల్‌ఫోన్‌ని అమర్చుకునే ఏర్పాట్లుంటాయి. మీట నొక్కితే ముప్పై అంగుళాల పొడవు పెరుగుతుంది. ఇంకేం.. అల్పాహారం.. మధ్యాహ్న భోజనం.. డిన్నర్‌.. ఎప్పుడైనా ఆహారం లాగిస్తూనే ఫొటోలు తీసుకోవచ్చు. బ్లూటూత్‌తోనూ ఫోన్‌ని అనుసంధానించొచ్చు. పూర్తి వివరాలకు www.selfiespoon.com క్లిక్కండి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని