మిలటరీ మెరుపులు!

ఒంటిపై ఖాకీ చొక్కా పడగానే కేజీ కండలేని కుర్రాడికైనా గుండెల్నిండా ధైర్యం వచ్చేస్తుంది. ఆ రంగుకున్న ఠీవీనే వేరు.

Published : 14 May 2016 01:08 IST

మిలటరీ మెరుపులు!

ఒంటిపై ఖాకీ చొక్కా పడగానే కేజీ కండలేని కుర్రాడికైనా గుండెల్నిండా ధైర్యం వచ్చేస్తుంది. ఆ రంగుకున్న ఠీవీనే వేరు. అందుకే బ్లాక్‌ అండ్‌ వైట్‌ కాలం నుంచి ఫ్యాషన్‌ ప్రియులు ఈ ఫ్యాబ్రిక్‌తో రకరకాల స్టైల్స్‌ సృష్టించారు. కొద్దిపాటి మార్పులతో మళ్లీ ఆ కాలం వచ్చేసిందండోయ్‌. అందుకే ఇప్పుడు బీ-ఔన్‌ బేబీల నుంచి సందు చివర కుర్రాళ్ల దాకా మిలిటరీ ప్రింట్లపై మోజు పడిపోతున్నారు. కార్గో ప్యాంట్లు, షార్ట్స్‌, స్కర్ట్స్‌, జాకెట్స్‌.. డిజైన్‌ ఏదైనా అన్నింటిపైనా మిలటరీ ముద్ర పడిపోవాల్సిందే. ఈ స్టైల్‌కి తోడు మడ్డీ బూట్లు, స్నీకర్లు, టోపీలూ ధరిస్తే మరింత దర్పం, హుందాతనం ఉట్టిపడుతుందని సెలవిస్తున్నారు డిజైనర్లు రీనా ధాకా, హేమంత్‌, నందితాలు. ఆ మజా పసిగట్టారేమో.. ఒకరి తర్వాత ఒకరు చొప్పున బాలీవుడ్‌ తారలంతా మిలటరీ మెరుపులకు తమ ఒంటిపై చోటిచ్చేస్తున్నారు. లేతందాల ఆలియా, క్వీన్‌ కంగనా, బొద్దుగుమ్మ సోనాక్షీ, కత్తిలాంటి జాక్వెలిన్‌.. ఇప్పటికే ఈ ట్రెండ్‌కి బ్రాండ్‌ అంబాసిడర్లుగా మారిపోయారు. ఈ సొగసులకు అమ్మాయి, అబ్బాయి తేడాలేం లేకపోవడంతో జాన్‌ అబ్రహం, సిద్ధార్థ్‌ మల్హోత్రాలతోపాటు ఇతర స్టార్లూ ధరించి మ్యాన్లీగా కనిపించారు. తారలే ట్రెండ్‌ని ఫాలో అవుతుంటే వాళ్లని అనుకరించే యువ అభిమానులు మాత్రం స్టైల్‌ని వదులుతారా? వాళ్లూ ఓకే చెప్పేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని