మొటిమలే సోకులట
చక్కని చుక్క మోముపై చిన్న మొటిమ వచ్చినా కంటిపై కునుకుండదు. అది కనుమరుగు అయ్యేవరకూ క్రీములు...
మొటిమలే సోకులట
చక్కని చుక్క మోముపై చిన్న మొటిమ వచ్చినా కంటిపై కునుకుండదు. అది కనుమరుగు అయ్యేవరకూ క్రీములు, లోషన్లు పూయడం పరిపాటే! కానీ అదేం చిత్రమో... మొహంపై మొటిమలు ఉండటమూ ఇప్పుడు ఓ ఫ్యాషనే అయి కూర్చుంది. లేకపోతే నకిలీ మొటిమల్ని ముఖంపై అతికించి మరీ క్యాట్‌వాక్ చేస్తున్నారు మోడళ్లు. మిలన్ ఫ్యాషన్ వీక్‌లో ఈ ‘ఫేక్ పింపుల్స్’ ట్రెండ్ మొదలై ప్రపంచమంతా పాకిపోయింది. సో.. మొటిమలున్నమ్మలూ మూతి ముడుచుకోవద్దు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.