నువ్వా? నేనా?

దీపికా పదుకొనే.. ప్రియాంకా చోప్రా ఇద్దరు వంకపెట్టలేని ముద్దుగుమ్మలే. బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్లుగా రాణిస్తూనే ఈమధ్యే హాలీవుడ్‌ తెర తట్టారు.....

Published : 17 Sep 2016 01:23 IST

నువ్వా? నేనా?

దీపికా పదుకొనే.. ప్రియాంకా చోప్రా ఇద్దరు వంకపెట్టలేని ముద్దుగుమ్మలే. బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్లుగా రాణిస్తూనే ఈమధ్యే హాలీవుడ్‌ తెర తట్టారు. ఎవరిది మంచి పాత్ర? అత్యధిక పారితోషికం పుచ్చుకుంటున్నదెవరు? అని మీడియాలో అప్పుడే విశ్లేషణలు మొదలయ్యాయి. దీనికితోడు ఇద్ద్దరూ అత్యధిక సంపాదనపరులంటూ ఫోర్బ్స్‌ కిరీటం కూడా తొడిగేసింది. ఆ వివరాలిస్తున్నాం. ఎవరు గొప్పో మీరే తేల్చేయండి మరి.

సంపాదనలో మేటి
* ఫోర్బ్స్‌ లెక్కల ప్రకారం దీపికా సంపాదన ఏడాదికి ఎనభై కోట్ల రూపాయలు. తొలిసారి హాలీవుడ్‌ తారల జాబితాలో చోటు దక్కించుకుంది.
* తొలి హాలీవుడ్‌ చిత్రం ట్రిపుల్‌ ఎక్స్‌లో దీపికాది మంచి ప్రాధాన్యం ఉన్న పాత్ర. స్టార్‌ హీరో విన్‌ డీజిల్‌తో పోటాపోటీగా ఉండే రోల్‌.
* ప్రియాంకతో పోలిస్తే ఫేమ్‌లో దీపికా కొంచెం వెనకే ఉంది. హాలీవుడ్‌ అవకాశాలను పెంచుకోవడానికి గతంలో ప్రియాంక హాలీవుడ్‌ వ్యవహారాలు చూసిన విలియం మోరీస్‌ ఎండీవర్స్‌ ఏజెన్సీనే నమ్ముకుంది.
* గతేడాది దీపికా నటించిన సినిమాలు వెయ్యికోట్ల వసూళ్లు రాబట్టాయి.
* బాలీవుడ్‌లో మొదటి సినిమాకే ఫిలింఫేర్‌ అందుకుంది.

పేరులో ముందు
* ప్రియాంకా ఈ ఏడాది డెబ్భైమూడు కోట్ల రూపాయలు పోగేసుకుంది.
* దీపికాకి ముందే ‘క్వాంటికో’ అనే థ్రిల్లర్‌ సీరియల్‌లో కీలకమైన పాత్ర పోషించి అమెరికాలో మంచి ప్రజాదరణ పొందింది.
* ఫోర్బ్స్‌ ప్రియాంకని టీవీ తారల జాబితాలో చేర్చినా ఐఫా, కేన్స్‌ సహా ఇతర అంతర్జాతీయ వేదికల్లో దీపికాని మించి ఎర్ర తివాచీ స్వాగతాలు అందుకుంది.
* బేవాచ్‌లో ప్రియాంక పాత్ర నిడివి తక్కువ. పైగా నెగెటివ్‌ పాత్ర.
* జాతీయ ఉత్తమనటి, రెండు ఫిలింఫేర్‌ అవార్డులు ప్రియాంక సొంతం. మూడు మ్యూజిక్‌ సింగిల్స్‌ కూడా పాడింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని