కంటితోనే షూటింగ్‌

ఫొటో షేరింగ్‌ సామాజికమాధ్యమం స్నాప్‌చాట్‌ యువతను ఆకట్టుకునే సరికొత్త కళ్లద్దాలను ఆవిష్కరించబోతోంది. కంటిచూపుతోనే ఎదుట...

Published : 01 Oct 2016 01:17 IST

కంటితోనే షూటింగ్‌

ఫొటో షేరింగ్‌ సామాజికమాధ్యమం స్నాప్‌చాట్‌ యువతను ఆకట్టుకునే సరికొత్త కళ్లద్దాలను ఆవిష్కరించబోతోంది. కంటిచూపుతోనే ఎదుట ఉన్న దృశ్యాలను వీడియా తీయడం దీని ప్రత్యేకత. కళ్లద్దాలకు ఇరువైపులా ఉన్న ఫ్రేమ్‌లో సూక్ష్మమైన కెమేరాలు అమర్చుతారు. బ్లూటూత్‌ లేదా వైఫైతో దాన్ని స్మార్ట్‌ఫోన్‌, ల్యాపీలతో అనుసంధానించొచ్చు. కావాల్సినపుడు ఒక్క క్లిక్‌తో వీడియోలు తీయొచ్చు. చెప్పడానికి తేలిగ్గా ఉన్నా దీని తయారీకి రెండేళ్లుగా కష్టపడుతున్నాం అంటోంది స్నాప్‌చాట్‌ యాజమాన్యం. ఈ సరికొత్త గ్యాడ్జెట్‌కి స్నాప్‌ ఇంక్‌ అని పేరు పెట్టేశారు. మన కరెన్సీలో చెప్పాలంటే ధర రూ.8,600. కొనాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని