చేత్తో చిత్రాలు... కాలిపై చిత్తరువులు

హ్యారీపోటర్‌.. ఎఫ్‌సీ బార్సిలోనా.. రామచిలక.. ఏంటివి? హాలీవుడ్‌ సినిమా, సాకర్‌ జట్టు, పక్షి. ఒకదానితో ఒకటి సంబంధం లేదంటారా? ఉంది బాస్‌!

Published : 08 Oct 2016 01:03 IST

చేత్తో చిత్రాలు... కాలిపై చిత్తరువులు

హ్యారీపోటర్‌.. ఎఫ్‌సీ బార్సిలోనా.. రామచిలక.. ఏంటివి? హాలీవుడ్‌ సినిమా, సాకర్‌ జట్టు, పక్షి. ఒకదానితో ఒకటి సంబంధం లేదంటారా? ఉంది బాస్‌! ఇవన్నీ కుర్రకారు షూస్‌ మీద మెరిసిపోతున్న ‘హ్యాండ్‌ పెయింటెడ్‌’ చిత్రాలు. ఇవేకాదు హర్రర్‌ బొమ్మలు.. ఆకట్టుకునే నినాదాలు.. నచ్చిన ప్రదేశాలు.. సినిమా తారలు.. ఒక్కటేమిటి అన్నీ యువతరం ఇష్టపడుతున్నవే. ఎందుకుంటే ఇది కొత్త ట్రెండంట. దిల్లీ, ముంబయి, హైదరాబాద్‌ ఎక్కడైనా ఇదే జోరు. దిల్లీ చాందినీచౌక్‌ అయినా.. హైదరాబాద్‌ చార్మినార్‌ అయినా.. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లాంటి ఆన్‌లైన్‌ సంతల్లో అయినా ఈ స్టైల్‌వి విరివిగా దొరుకుతున్నాయ్‌. బాలీవుడ్‌ కుర్రభామలు ఆలియాభట్‌, అతియాశెట్టి, దీపికా పదుకొనేలాంటి కుర్రభామలు వీటిని వేసుకొని ఒయ్యారాలు పోతుంటే కాలేజీ కుర్రకారు మాత్రం అనుసరించకుండా ఉంటారా? కొన్ని బ్రాండ్లు రకరకాల చిత్రాలతో కూడిన స్నీకర్లను మార్కెట్లోకి వదులుతుంటే.. ఇంకొన్ని నచ్చిన చిత్రం, నినాదం వేసివ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. అడిడాస్‌, రీబాక్‌, గుక్కీలాంటి ప్రఖ్యాత బ్రాండ్లూ పోటీలో ఉన్నాయి. ‘దీన్నిబట్టి చూస్తుంటే మనసులోని భావోద్వేగాలు చెప్పుకోవడానికి, అభిమానం చాటుకోవడానికి పాదరక్షలు కూడా ఓ వేదికగా మారిపోయాయి’ అంటాడు ఫ్యాషన్‌ బ్లాగర్‌ అఖీల్‌ ఫిర్దోస్‌. నాణ్యతను బట్టి ధర రూ.1500 మొదలవుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని