ఎగరేసి.. సెల్ఫీ

మీ దగ్గర స్మార్ట్‌ఫోన్‌ ఉందిగా! ముందు కెమెరా ఆన్‌ చేయండి. సెల్ఫీ కోసం క్లిక్‌మనిపిస్తూనే ఫోన్‌ని పైకి ఎగరేయండి.

Published : 29 Oct 2016 01:05 IST

నయా ట్రెండ్‌
ఎగరేసి.. సెల్ఫీ

  మీ దగ్గర స్మార్ట్‌ఫోన్‌ ఉందిగా! ముందు కెమెరా ఆన్‌ చేయండి. సెల్ఫీ కోసం క్లిక్‌మనిపిస్తూనే ఫోన్‌ని పైకి ఎగరేయండి. ఆ ఫోన్‌ గాల్లోంచి కింద పడేలోపే మీరు రెండు చేతులతో చప్పట్లు కొట్టాలి. ఆ దృశ్యం ఫోన్‌ కెమేరాలో నిక్షిప్తం కావాలి. ఏంటీ తమాషా అంటారా? ట్రెండ్‌ అండీ బాబూ ట్రెండ్‌. ‘హై-ఫైవ్‌ సెల్ఫీ’ పేరుతో వైరల్‌గా.. వైరస్‌లా పాకేసి ఆన్‌లైన్‌ ప్రపంచాన్ని చుట్టేస్తోంది. సేత్‌ స్నీడర్‌ అనే ఓ కుర్రాడు ఇలాంటి పర్‌ఫెక్ట్‌ సెల్ఫీ పెడితే రెండులక్షల మంది రీట్వీట్‌ చేశారు. 4లక్షల 40వేలమంది లైకారు. ఈ లెక్కలు చూస్తేనే అర్థమవుతోందిగా. ఇదెంత జోరు మీదుందో!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని