ఫొటో.. కుదరదిక

సందు దొరికితే చాలు... పాపరాజ్జీలు తారల వెనకాల పడతారు. అనుమతి లేకుండానే వారి వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి ఫొటోలు తీసి ఏవో కథనాలో, కట్టుకథలో అల్లుతారు.

Published : 29 Oct 2016 01:07 IST

ఫొటో.. కుదరదిక

సందు దొరికితే చాలు... పాపరాజ్జీలు తారల వెనకాల పడతారు. అనుమతి లేకుండానే వారి వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి ఫొటోలు తీసి ఏవో కథనాలో, కట్టుకథలో అల్లుతారు. వాటికి సంజాయషీ ఇచ్చుకోలేక పాపం సెలెబ్రెటీలు ఒక్కోసారి చాలానే అగచాట్లు పడుతుంటారు. ఈ బాధల్నుంచి తప్పించుకోవడానికి సెలెబ్రెటీల కోసం ప్రత్యేకంగా ‘యాంటీ పాపరాజ్జీ’ పేరుతో ఒకరకమైన స్కార్ఫ్‌లు మార్కెట్లోకి వచ్చేశాయి. వీటిని మెడలో వేసుకుంటే చాలు.. ఎలాంటి కెమేరాతో క్లిక్‌మనిపించినా మొహం, శరీర భాగాలు తప్పించి కేవలం దుస్తులే ఫొటోలుగా వస్తాయి. పైగా వీటిల్లోనూ రకరకాల రంగులు, డిజైన్లు ఉండటంతో కొత్తరకం స్టైల్‌గానూ కనిపిస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు