అభిరుచుల పుస్తకం

ఈకాలం కుర్రకారుకి అందం మీదే కాదు.. తినే ఆహారం విషయంలోనూ పట్టింపులు ఎక్కువే. సన్నజాజి మేని, కండరగండడి దేహం కావాలనుకునే అమ్మాయిలు...

Published : 26 Nov 2016 00:53 IST

అభిరుచుల పుస్తకం

కాలం కుర్రకారుకి అందం మీదే కాదు.. తినే ఆహారం విషయంలోనూ పట్టింపులు ఎక్కువే. సన్నజాజి మేని, కండరగండడి దేహం కావాలనుకునే అమ్మాయిలు, అబ్బాయిలైతే కేలరీల్ని కొలిచి మరీ తినేస్తుంటారు. పరుగుల జీవితంలో ఇలాంటి జాగ్రత్తలు తప్పదని వాళ్ల భావన. ఇక ధ్యానం, యోగా సరేసరి. అచ్చంగా ఇలాంటి అభిప్రాయం ఉన్నవాళ్లను దృష్టిలో పెట్టుకొని ‘టేస్ట్‌ ఆఫ్‌ వెల్‌బీయింగ్‌’ అనే పుస్తకం మార్కెట్లోకి వచ్చింది. యోగాకు ప్రాచుర్యం కల్పిస్తున్న ‘ఇషా యోగా సెంటర్‌’ దీన్ని తీసుకురావడం విశేషం. కూరల్లో వేసుకునే పోపు గింజల దగ్గర్నుంచి రాగులు, సజ్జల వంటకాలు, గులాబీరేకుల తేనీరు.. ఎలా ఎన్నో ప్రత్యేకమైన వంటకాలు, ఆదర్శప్రాయ జీవనశైలి విశేషాలతో రూపొందించారు. ప్రచురణసంస్థ హార్పర్‌కొలిన్స్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని