అదితి.. అధరహో..

ఖాతాలో ఉన్న హిట్లు.. స్టార్‌డమ్‌ సంగతి పక్కనబెడితే బాలీవుడ్‌లో అత్యంత అందమైన అమ్మాయిల్లో ముందుండే పేరు అదితీరావు హైదరీ.

Published : 03 Dec 2016 01:47 IST

అదితి.. అధరహో..

ఖాతాలో ఉన్న హిట్లు.. స్టార్‌డమ్‌ సంగతి పక్కనబెడితే బాలీవుడ్‌లో అత్యంత అందమైన అమ్మాయిల్లో ముందుండే పేరు అదితీరావు హైదరీ. బాలీవుడ్‌ విశ్లేషకులు, అభిమానులు ‘లిప్‌స్పిరేషన్‌’కి పర్యాయపదంగా చెప్పేది ఈ భామనే. ఈ పేరెలా వచ్చిందో చెబుతోంది ఓ ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌. ఆ విషయాలివి.

* విశాలమైన నుదురు.. ప్రకాశవంతమైన కళ్లు.. ముదురు గులాబీ ‘ఫుషియా’ రంగు పెదాలు ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయట.
* ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అంటూ అదితి యాభైలలోని స్టైల్‌ని అనుకరిస్తుంది. కనుబొమ్మలకు ఎలాంటి మేకప్‌ వేయదు. సహజసిద్ధంగా వచ్చిన ఎరుపురంగు చెక్కిళ్లు.. ఆమె ప్రత్యేకత.
* న్యూడ్‌లిప్స్‌ అనగానే పాప్‌సింగర్‌ బియాన్‌ నోల్స్‌ గుర్తొస్తుంది. బాలీవుడ్‌లో అంత అందంగా కనపడేది అదితీనే అంటారు.
* పెదాలకు ముదురు రంగు లిప్‌స్టిక్‌ అద్దడంలో ఏమాత్రం పొరపాటు జరిగినా మొదటికే మోసం వస్తుంది. అలాంటి పొరపాట్లతో కెమేరాలకు చిక్కిన తారలు బోలెడు. ఎన్నో పార్టీలకు గాఢమైన లిప్‌స్టిక్‌తో వచ్చిన అదితి ఆ పొరపాటు ఎప్పుడూ చేయలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని