నవ్వితే కొలువుకు భరోసా

నవ్వడం.. లవ్వడం.. ఇష్టపడని కుర్రకారుంటారా? ప్రేమ వ్యక్తిగతం సరే. నవ్వుతో ముఖకండరాలకు...

Published : 18 Mar 2017 01:38 IST

నవ్వితే కొలువుకు భరోసా

వ్వడం.. లవ్వడం.. ఇష్టపడని కుర్రకారుంటారా? ప్రేమ వ్యక్తిగతం సరే. నవ్వుతో ముఖకండరాలకు కసరత్తనీ.. బోలెడు లాభాలుంటాయనీ తెలుసు. ఇదికాకుండా అదేపనిగా నవ్వుతూ, నవ్విస్తూ ఉండేవాళ్ల కొలువుకూ భరోసా ఉంటుందనే కొత్త సంగతి చెబుతోంది ఓ అధ్యయనం. అదెలా అంటే అమెరికాకు చెందిన అలిసన్‌ బ్రూక్స్‌, మారిస్‌ స్వీట్జర్‌ అనే ఇద్దరు పరిశోధకుల అధ్యయన వివరాలు వినాల్సిందే. వీళ్లు దేశంలోని ప్రముఖ కంపెనీలన్నీ తిరుగుతూ యాజమాన్యాలకు చిన్నపాటి పరీక్ష పెట్టారు. ‘ఉన్నపళంగా సంస్థ నుంచి ముగ్గురు ఉద్యోగుల్ని తీసేయాల్సి వస్తే ముందు ఎవర్ని తీసేస్తారు? చివర్లో ఎవర్ని తీసేస్తారు’ అని అడిగారు. జోకులు పేలుస్తూ సందడి చేసేవాళ్లూ.. హాస్యానికి విరగబడి నవ్వే ఉద్యోగుల్ని చివరాఖర్న తీసేస్తాం అని 90శాతం యాజమాన్యాలు చెప్పాయిట. మరోవైపు ఇదేమాట ఉద్యోగులనూ అడిగారు. మీ సహోద్యోగుల్లో ఎవరికి ఎక్కువ రేటింగ్‌ ఇస్తారని అడిగితే అత్యధికులు జోవియల్‌గా ఉండేవారికే ఓటేశారు. సో.. నవ్వుతో యోగం.. భోగం అనే మాటకి కొలువు నిలబెట్టే సాధనం అనే మరోమాట కూడా కలపాలన్నమాట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని