చల్లని థెరపీ.. నొప్పులు మటాష్‌

కత్తిలా ఉండాలి.. కండలు పెంచేయాలి.. అనుకోని కుర్రకారుంటారా? సరదాగానో.. సీరియస్‌గానో జిమ్‌ల్లో దూరి తెగ వ్యాయామాలు చేసేస్తారు.

Published : 13 May 2017 01:11 IST

చల్లని థెరపీ.. నొప్పులు మటాష్‌

కత్తిలా ఉండాలి.. కండలు పెంచేయాలి.. అనుకోని కుర్రకారుంటారా? సరదాగానో.. సీరియస్‌గానో జిమ్‌ల్లో దూరి తెగ వ్యాయామాలు చేసేస్తారు. చెమటలు చిందేలా కసరత్తులు చేశాక ఎవరైనా అలసిపోవడం సహజమే. అప్పుడేం చేయాలి? చల్లచల్లని ‘కోల్డ్‌ వాటర్‌ థెరపీ’కి ఓటేయాలి. దీన్నే క్రయోథెరపీ అని కూడా అంటున్నార్లెండి. అలసట తీరడానికీ, పునరుత్తేజం కలగడానికీ ఈ థెరపీ మహ బాగా పని చేస్తుందంటున్నారు నిపుణులు. ట్రెండ్‌ జోరు మీదుంది. జిమ్‌లు, స్పాలే ఈ థెరపీ కేంద్రాలు. వీటికోసం ప్రత్యేకంగా సైరో ఛాంబర్లుంటాయి. అక్కడ ఒక నీటి తొట్టెల్లాంటి వాటిల్లోకి వెళ్లి సేద తీరగానే విపరీతమైన వేగంతో చల్లని నీటిని వదులుతారు. చలి కాచుకోవడానికి అంతకుముందే శరీరాన్ని దళసరి తువాలుతో చుట్టేస్తారు. మైనస్‌ 100 డిగ్రీల చలిలో దాదాపు 15 నిమిషాలు అలాగే ఉంటే థెరపీ పూర్తైనట్టే. ఇంతకీ దీంతో ఏం లాభం? అంటే చర్మం కింది పొరల్లోని మృతకణాలు తొలగిపోతాయి.. నునుపైన, కాంతివంతమైన కొత్త చర్మం తయారవుతుంది’ అంటున్నారు డా. ఆశిష్‌. పైగా శరీరం అంతర్భాగాల్లో మనకు తెలియకుండా ఉన్న వాపులు మటుమాయం అవుతాయంటున్నారు. ముంబయి, దిల్లీ, బెంగళూరు లాంటి మెట్రో నగరాల్లో ఈ ధోరణి ఇప్పటికే వూపందుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ హవా మొదలైంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని