అధరాలకు తొడుగేయండి

ఎన్నైనా చెప్పండి.. అమ్మాయిల అందాన్ని ద్విగుణీకృతం చేసే వాటిలో

Published : 10 Jun 2017 01:30 IST

అధరాలకు తొడుగేయండి

న్నైనా చెప్పండి.. అమ్మాయిల అందాన్ని ద్విగుణీకృతం చేసే వాటిలో ముందుండేవి అధరాలే. వాటిని కాపాడుకోవడానికి లిప్‌స్టిక్‌లు, లోషన్లు, బామ్‌లు.. కుర్ర అమ్మాయిలు పడే పాట్లెన్నో. ఈ అవసరానికి ఆసరానిస్తూ ‘లిప్‌ మాస్క్‌’ ట్రెండ్‌ వచ్చేసింది.

ఏంటీ లిప్‌ మాస్క్‌?: నీరు, గ్లిజరిన్‌, విటమిన్‌-ఇ లతో కలిపి తయారు చేసే దళసరి చర్మంలాంటి జెల్‌ షీట్‌లేే లిప్‌ మాస్క్‌లు. గులాబీ, బంగారు వర్ణాల్లో ఉంటాయి.
ఎలా వాడాలి?: ముందు పెదాల భాగాన్ని పూర్తిగా శుభ్రంగా కడిగేయాలి. జిగురుగా ఉండే ఈ మాస్కుల్ని పెదాలపై పరిచి పది నుంచి పదిహేను నిమిషాలు ఉంచాలి.
ఏంటి ప్రయోజనం?: పెదాలు నిగనిగలాడుతూ మృదువుగా ఉంటాయి. చలికాలంలోనూ పొడిబారవు. పగుళ్లు ఏర్పడవు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని